కేసీఆర్‌ను విచారించిన సీబీఐ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీబీఐ అధికారులు విచారించడం కలకలం రేపింది. సోమవారం హైదరాబాద్‌లో కేసీఆర్ ఇంటికి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందం సుధీర్ఘంగా విచారించింది. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ 2006లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణంలో పెద్దెత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. తొలుత నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్(NBCC) సొంతం చేసుకున్న నిర్మాణ కాంట్రాక్టును హఠాత్తుగా రద్దు చేసి రాష్ట్రానికి చెందిన […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీబీఐ అధికారులు విచారించడం కలకలం రేపింది. సోమవారం హైదరాబాద్‌లో కేసీఆర్ ఇంటికి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందం సుధీర్ఘంగా విచారించింది. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కేసీఆర్ 2006లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణంలో పెద్దెత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. తొలుత నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్(NBCC) సొంతం చేసుకున్న నిర్మాణ కాంట్రాక్టును హఠాత్తుగా రద్దు చేసి రాష్ట్రానికి చెందిన మత్క్యశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు అప్పగించారు. ఇలా చేయడం వెనుక ముడుపులు చేతులు మారాయని ఆరోపణ.
అప్పటికి సమస్య రాలేదు. అయితే ఆస్పత్రుల నిర్మాణం నాసిరకంగా చేయడంతో 2007లో ఈఎస్‌ఐ సంస్థ విచారణకు ఆదేశించింది. అదే సమయంలో సీబీఐకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో 2011లో సీబీఐ అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసింది. అప్పటి మత్స్యశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నాసిరకం నిర్మాణాల వల్ల దాదాపు రూ.5 కోట్లు ప్రజాధనం మట్టిపాలైందని విచారణలో తేలింది.
కేంద్ర సంస్థకు దక్కిన కాంట్రాక్టును రద్దు చేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరి్‌కు అప్పగించడంలోనే అసలు మతలబు ఉందని సీబీఐ భావిస్తోంది. అందుకే అప్పట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్‌ను సీబీఐ విచారించింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్దమవుతోంది. అవసరమైతే కేసీఆర్‌ను మరోసారి విచారించవచ్చని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.