Telugu Global
Health & Life Style

పోషకాల సమాహారం సీతాఫలం

సీతాఫలం… పండులో తియ్యదనంతోపాటు పుష్కలమైన పోషకాలు కూడా ఉంటాయి. శీతాకాలాన్ని గుర్తు చేసే పండ్లలో సీతాఫలం ఒకటి, ఇంగ్లీషులో కస్టర్డ్‌ యాపిల్‌ అనే పిలిచే సీతాఫలాన్ని షుగర్‌ యాపిల్‌ అని కూడా అంటారు. ఏపండులో అయినా శరీరానికి మాంసకృత్తులు, కేలరీలు అందిస్తాయి. అయితే సీతాఫలంలో ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలతోపాటు కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ […]

పోషకాల సమాహారం సీతాఫలం
X
సీతాఫలం… పండులో తియ్యదనంతోపాటు పుష్కలమైన పోషకాలు కూడా ఉంటాయి. శీతాకాలాన్ని గుర్తు చేసే పండ్లలో సీతాఫలం ఒకటి, ఇంగ్లీషులో కస్టర్డ్‌ యాపిల్‌ అనే పిలిచే సీతాఫలాన్ని షుగర్‌ యాపిల్‌ అని కూడా అంటారు. ఏపండులో అయినా శరీరానికి మాంసకృత్తులు, కేలరీలు అందిస్తాయి. అయితే సీతాఫలంలో ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలతోపాటు కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పక తప్పదు.
విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరి చేరవు. కేన్సర్‌ కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్‌ కేన్సర్‌, మెదడులో ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది. బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే రక్షణ గుణం సీతాఫలానికుంది. ఈ పండ్లలో బి-6 విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతోపాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. షుగర్‌ వ్యాధి ఉన్నవాళ్ళకి సీతాఫలం శత్రువని చెప్పవచ్చు. అందుచేత దీనికి దూరంగా ఉంటే మంచింది.
* ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు. కళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోపడుతుంది.
* సీతాఫలాలు తినటం వల్ల కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. గుండెకు మంచిది.
* చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగా ఉపయోగపడతాయి. చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి ఉంది.
* మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోజూ తినగలిగితే ఎంతో మార్పు కనిపిస్తుంది.
* డైటింగ్‌ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది.
* సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది.
* ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది.
* సీతాఫలం బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు.
* సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి.
* గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది.
* సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
First Published:  20 Oct 2015 3:32 AM IST
Next Story