బీసీసీఐలో శివసేన వీరంగం
ముంబైలో శివసేన కార్యకర్తలు మరోసారి చెలరేగిపోయారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళుతున్న సుధీంద్ర కులకర్ణిపై ఇంకుతో దాడి చేసిన విషయం తెలిసిందే! ఆ ఘటన ఇంకా మరవకముందే సోమవారం బీసీసీఐ కార్యాలయంలో వీరంగం సృష్టించారు.ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్- షహర్యార్‌ఖాన్ల మధ్య జరగాల్సిన చర్చను శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దాదాపు 100 మంది శివసేన కార్యకర్తలు బీసీసీఐ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. భారత్‌పై ఉగ్రవాదులను […]
ముంబైలో శివసేన కార్యకర్తలు మరోసారి చెలరేగిపోయారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళుతున్న సుధీంద్ర కులకర్ణిపై ఇంకుతో దాడి చేసిన విషయం తెలిసిందే! ఆ ఘటన ఇంకా మరవకముందే సోమవారం బీసీసీఐ కార్యాలయంలో వీరంగం సృష్టించారు.ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్- షహర్యార్‌ఖాన్ల మధ్య జరగాల్సిన చర్చను శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దాదాపు 100 మంది శివసేన కార్యకర్తలు బీసీసీఐ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఎలా ఆడతారంటూ బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌ను ఘెరావ్ చేశారు.
ఐసీసీ షెడ్యూలు ప్రకారం.. 2015, 2016లో భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సీరీస్‌ల విషయమై చర్చించేందుకు బీసీసీఐ ఆహ్వానం మేరకు పీసీబీ షహర్యార్‌ఖాన్ ముంబై వచ్చారు. దీంతో భేటీ వేదికను మంగళవారం ఢిల్లీలోని ఓ హోటల్‌కు మార్చారు. ఈ చర్యను కాంగ్రెస్, ఎన్‌సీపీ సహా పలు పార్టీలు నిరసించగా, శివసేన మాత్రం సమర్థించుకుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మా రాష్ట్రంలో చర్చించుకోండి కావాల్సినంత భద్రత కల్పిస్తామని భరోసా కూడా ఇచ్చారు.
మొదటి నుంచీ ఇంతే..!
మొదటి నుంచి కూడా శివసేనకు పాకిస్తాన్ అన్నా, ముస్లిములు అన్నా అంతులేని ద్వేషం. పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలను వద్దని బలంగానే చెబుతోంది.
- 2003 డిసెంబరులో పాకిస్తాన్ భారత పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించింది. డిల్లీలో మ్యాచ్ జరగకుండా మైదానంలో పిచ్‌ను శివసేన తవ్వేసింది.
- 2005 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌తో న్యూడిల్లీలో జరగాల్సిన మ్యాచ్‌ను సైతం అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
- 2009 నవంబరులో బాల్ థాకరే సచిన్‌పై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపిస్తూ.. ఐబీన్ మీడియా కార్యాలయాలపై దాడి చేశారు.