అవును.. నేను కాపీ కొడతాను
బాహుబలితో చరిత్ర సృష్టించిన దర్శక దిగ్గజం రాజమౌళి చెప్పిన మాటిది. అది కూడా వందలాది మంది ఉన్న ఓ నిండు సభలో రాజమౌళి ఇలా ప్రకటించాడు. మద్రాసులోని ఐఐటీ విద్యార్థులను ఉద్దేశించి రాజమౌళి ప్రసంగించాడు. విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా బదులిచ్చాడు రాజమౌళి. మీరు హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొడతారా అని అడిగాడు ఆ విద్యార్థి. ఆ ప్రశ్నకు తడబడకుండా సమాధానిచ్చాడు జక్కన్న. అవును.. నేను […]
BY sarvi20 Oct 2015 12:33 AM IST
X
sarvi Updated On: 20 Oct 2015 3:40 AM IST
బాహుబలితో చరిత్ర సృష్టించిన దర్శక దిగ్గజం రాజమౌళి చెప్పిన మాటిది. అది కూడా వందలాది మంది ఉన్న ఓ నిండు సభలో రాజమౌళి ఇలా ప్రకటించాడు. మద్రాసులోని ఐఐటీ విద్యార్థులను ఉద్దేశించి రాజమౌళి ప్రసంగించాడు. విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా బదులిచ్చాడు రాజమౌళి. మీరు హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొడతారా అని అడిగాడు ఆ విద్యార్థి. ఆ ప్రశ్నకు తడబడకుండా సమాధానిచ్చాడు జక్కన్న. అవును.. నేను హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొడతాను అని ప్రకటించాడు. అయితే కేవలం తను భావాన్ని మాత్రమే తీసుకుంటానని, టెక్నాలజీని ఎడాప్ట్ చేసుకుంటానని చెబుతున్నాడు. అంతేతప్ప హాలీవుడ్ సన్నివేశాల్ని తన సినిమాల్లో ఇరికించడానికి ప్రయత్నించనన్నాడు. అంతెందుకు బాహుబలి సినిమాకు కూడా చాలా హాలీవుడ్ సినిమాల్ని ప్రేరణగా తీసుకున్నానని చెబుతున్నాడు. అయితే ఇంగ్లిష్ సినిమాల్లోని కాన్సెప్ట్ ను, అక్కడి టెక్నాలజీని మన నేటివిటీకి తగ్గట్టు ఎంత పర్ ఫెక్ట్ గా చూపించగలిగామనే విషయంపైనే తను దృష్టిపెడతానన్నాడు రాజమౌళి. అంతేకాదు.. కాపీ కొట్టకుండా సొంతంగా తను ఓ సినిమా చేశానని ఎవరైనా చెబితే నమ్మొద్దని కూడా సలహా ఇస్తున్నాఢు.
Next Story