Telugu Global
Others

మరణాన్ని, వారసత్వాన్ని ముందే ఊహించిన ఇందిరా గాంధీ

ఉక్కు మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఆమె తన మరణాన్ని ముందే ఊహించారని కాంగ్రెస్ నేత, ఇందిర సన్నిహితుడు ఎంఎల్ ఫోతేదార్ చెప్పారు. ఇందిర తన రాజకీయ వారసుల గురించి చెప్పిన అంశాలను వెల్లడించారు ఓ ఇంటర్వ్యూలో ఇందిరా మరణానికి మూడు రోజుల ముందు జరిగిన విషయాన్ని ఫొతేదార్ గుర్తు చేసుకున్నారు. ఇందిర చనిపోవడానికి మూడు రోజుల ముందు తాను కాశ్మీర్‌లో పర్యటించానని చెప్పారు. అనంతరం […]

మరణాన్ని, వారసత్వాన్ని ముందే ఊహించిన ఇందిరా గాంధీ
X

ఉక్కు మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఆమె తన మరణాన్ని ముందే ఊహించారని కాంగ్రెస్ నేత, ఇందిర సన్నిహితుడు ఎంఎల్ ఫోతేదార్ చెప్పారు. ఇందిర తన రాజకీయ వారసుల గురించి చెప్పిన అంశాలను వెల్లడించారు

ఓ ఇంటర్వ్యూలో ఇందిరా మరణానికి మూడు రోజుల ముందు జరిగిన విషయాన్ని ఫొతేదార్ గుర్తు చేసుకున్నారు. ఇందిర చనిపోవడానికి మూడు రోజుల ముందు తాను కాశ్మీర్‌లో పర్యటించానని చెప్పారు. అనంతరం ఢిల్లీ వచ్చాక ఇందిరను కలిసినట్టు వెల్లడించారు. ఆ సమయంలో ఇందిర తను ఆఖరి రోజులు గడుపుతున్నట్టుగా మాట్లాడారని ఫొతేదార్ చెప్పారు.

ఆ సమయంలోనే తన వారసురాలు ప్రియాంకేనని ఇందిర వెల్లడించారట. అచ్చం తనలాగే ఉండే ప్రియాంక రాబోయే శతాబ్దాన్ని శాసిస్తుందని ఇందిరమ్మ జోస్యం చెప్పారని వెల్లడించారు. ఇందిర చెప్పిన మాటలను ఆ రోజు రాత్రి డైరీలో రాసుకున్నానని చెప్పారు. ఇందిరా గాంధీ ఊహించినట్టే మూడు రోజుల తర్వాత ఆమె హత్యకు గురయ్యారని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.

ఇందిర మరణం తర్వాత ప్రియాంక గురించి ఆమె చెప్పిన మాటలను రాజీవ్, సోనియాకు వివరించానన్నారు. అయితే సోనియా మాత్రం ఆ మాటల పట్ల సానుకూలంగా స్పందించినట్టు అనిపించలేదని ఫొతేదార్ అన్నారు. ఇందిరా గాంధీ చెప్పినట్టు భవిష్యత్తులో ప్రియాంక గాంధీ గొప్ప నాయకురాలవుతారని ఫొతేదార్ అభిప్రాయపడ్డారు. ఇందిర చెప్పినట్టు ప్రియాంకలో ఆ దూకుడు ఉందని కితాబిచ్చారు.

First Published:  20 Oct 2015 6:50 AM IST
Next Story