Telugu Global
International

'ఫేస్ బుక్' ద్వారా బ్రేకింగ్ న్యూస్

ఇపుడు ఫేస్‌ బుక్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ యాప్‌ను ప్రవేశపెడుతోంది. ఇన్నాళ్లూ కేవలం సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫారంగానే ఉన్న ఫేస్ బుక్… తన పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే ఈ బ్రేకింగ్ న్యూస్ నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ యాప్ వేసుకున్న యూజర్లు తమకు నచ్చిన కంటెంటుకు సంబంధించిన రియల్ టైమ్ నోటిఫికేషన్లు పొందే అవకాశం ఉంది. అయితే ఫేస్ బుక్ నేరుగా […]

ఫేస్ బుక్ ద్వారా బ్రేకింగ్ న్యూస్
X

ఇపుడు ఫేస్‌ బుక్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ యాప్‌ను ప్రవేశపెడుతోంది. ఇన్నాళ్లూ కేవలం సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫారంగానే ఉన్న ఫేస్ బుక్… తన పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే ఈ బ్రేకింగ్ న్యూస్ నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ యాప్ వేసుకున్న యూజర్లు తమకు నచ్చిన కంటెంటుకు సంబంధించిన రియల్ టైమ్ నోటిఫికేషన్లు పొందే అవకాశం ఉంది. అయితే ఫేస్ బుక్ నేరుగా ఈ యాప్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా వివిధ ప్రచురణ సంస్థలు ఫేస్ బుక్ తరఫున ఈ మొబైల్ నోటిఫికేషన్లు ఇస్తాయని తెలుస్తోంది. దీనివల్ల ఫేస్ బుక్ ఒక మల్టీ ఫంక్షనింగ్ ప్లాట్ ఫారంగా మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ వార్తాసంస్థలకు సంబంధించిన న్యూస్ యాప్ లు ఉన్నా.. వాటిలో దేనికీ కూడా ఫేస్ బుక్ కు ఉన్నంత ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌ లేదని, అందుకే వాటికి కావల్సిన విస్తృతి కల్పించడం, అదే సమయంలో తమ ప్రాముఖ్యాన్ని కూడా పెంచుకోవడం అనే రెండు లక్ష్యాలపై ఫేస్ బుక్ గురి పెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  20 Oct 2015 8:33 AM IST
Next Story