శంకుస్థాపనను బహిష్కరించిన కాంగ్రెస్
రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ కాంగ్రెస్ బహిష్కరించింది. శంకుస్థాపన కార్యక్రమాన్ని చంద్రబాబు తన ఇంటి కార్యక్రమంగా, పార్టీ ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. శంకుస్థాపనకు విపక్షాలను ఆహ్వానించే విషయంలో ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించలేదన్నారు. ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాల బలవంతంగా సమీకరించిన ప్రభుత్వం మరో 50 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయించేందుకు ప్రయత్నించడం దారుణమని విమర్శించారు. రాజధాని స్థల ఎంపికలోనూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని శైలజానాథ్ ఆరోపించారు. చంద్రబాబు […]
రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ కాంగ్రెస్ బహిష్కరించింది. శంకుస్థాపన కార్యక్రమాన్ని చంద్రబాబు తన ఇంటి కార్యక్రమంగా, పార్టీ ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. శంకుస్థాపనకు విపక్షాలను ఆహ్వానించే విషయంలో ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించలేదన్నారు.
ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాల బలవంతంగా సమీకరించిన ప్రభుత్వం మరో 50 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయించేందుకు ప్రయత్నించడం దారుణమని విమర్శించారు. రాజధాని స్థల ఎంపికలోనూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని శైలజానాథ్ ఆరోపించారు. చంద్రబాబు ఇలా ఏకపక్షంగా ముందుకెళ్తున్నందున అమరావతి శంకుస్థాపనకు వెళ్లకూడదని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు.