శంకుస్థాపనకు వదంతుల ముప్పు ఉందా?
అమరావతి శంకుస్థాపనకు గడువు దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు… శంకుస్థాపన ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయని చెప్పారు. అదే సమయంలో కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. చంద్రబాబు ఏమన్నారంటే ” కొన్ని రాజకీయ పార్టీలు ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూమర్లు సృష్టించే అవకాశం కూడా ఉంది. […]
అమరావతి శంకుస్థాపనకు గడువు దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు… శంకుస్థాపన ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయని చెప్పారు. అదే సమయంలో కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు.
చంద్రబాబు ఏమన్నారంటే ” కొన్ని రాజకీయ పార్టీలు ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూమర్లు సృష్టించే అవకాశం కూడా ఉంది. వదంతులు నమ్మవద్దు. కావాలని రూమర్లు సృష్టించే అవకాశం ఉంది” అని అన్నారు. గోదావరి పుష్కరాల సమయంలోనూ ఇలాంటి వదంతుల కారణంగానే తొక్కిసలాట జరిగి ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పుష్కరాల సమయంలో ఒక మహిళ తన దగ్గరకు వచ్చి విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, అందరూ కేకలు వేస్తున్నారని చెప్పిందని వెల్లడించారు. ఇలాంటి రూమర్లు కావాలనే సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
సభకు వచ్చే ప్రజల దృష్టి మళ్లించేందుకు ఒకరిద్దరు వచ్చి ఏదైనా రభస చేస్తే పట్టించుకోవద్దని కోరారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని చంద్రబాబు చెప్పారు. అయితే చంద్రబాబు ఆరోపణలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. శంకుస్థాపన రోజు ఏదైనా అపశృతి జరిగితే నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.