Telugu Global
CRIME

రేప్ కేసులో నటుడు విశాల్‌ థక్కర్‌ అరెస్ట్

‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘చాందినీ బార్’, తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన నటుడు విశాల్‌ థక్కర్‌ ఇపుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఓ టీవీ నటిని నమ్మించి కొంతకాలం సహ జీవనం చేసిన విశాల్‌ తర్వాత ఆమె వివాహానికి ప్రతిపాదించగా తిరస్కరించడంతో అసలు కథ మొదలయ్యింది. పెళ్ళి విషయం ప్రస్తావించగానే విశాల్‌ మొగం చాటేయడం మొదలెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. ఇదే సమయంలో ఆమె నివాసానికి వచ్చిన విశాల్‌ ఆమెతో అశ్లీలంగా […]

‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘చాందినీ బార్’, తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన నటుడు విశాల్‌ థక్కర్‌ ఇపుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఓ టీవీ నటిని నమ్మించి కొంతకాలం సహ జీవనం చేసిన విశాల్‌ తర్వాత ఆమె వివాహానికి ప్రతిపాదించగా తిరస్కరించడంతో అసలు కథ మొదలయ్యింది. పెళ్ళి విషయం ప్రస్తావించగానే విశాల్‌ మొగం చాటేయడం మొదలెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. ఇదే సమయంలో ఆమె నివాసానికి వచ్చిన విశాల్‌ ఆమెతో అశ్లీలంగా ప్రవర్తించాడు. ఆ యువతి వెంటనే పోలీసులకు విషయం చెప్పి తనపై అత్యాచారం చేశాడని, పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడని వివరించింది. విచారణ జరిపిన పోలీసులు విశాల్‌ థక్కర్‌ను అరెస్ట్‌ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ముంబాయిలోని చార్కోప్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ రామచంద్ర గైక్వాడ్ తెలిపారు. బాధిత యువతి, నటుడు విశాల్ థక్కర్ గత కొన్ని నెలల నుంచి సహజీవనం చేస్తున్నారని, ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ థక్కర్ నమ్మించాడని రామచంద్ర చెప్పారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోపాటు శారీరకంగానూ వేధింపులకు గురి చేసేవాడని ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. నిఘా పెట్టిన మూడు రోజుల అనంతరం బొరివాలీ ఏరియాలో విశాల్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. విశాల్పై 323, 376, 420, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

First Published:  19 Oct 2015 9:32 PM IST
Next Story