రుద్రమ గొప్పా... గోన గన్నారెడ్డి గొప్పా..?
గుణశేఖర్ ఎంతో కాలంగా చేయాలనుకున్న హిస్టారికల్ డ్రామ రుద్రమదేవి. ఇటువంటి హిస్టారికల్ డ్రామ చేయాలనుకునే ఆయన ప్యాషన్ ను అభినందించ వచ్చు. కానీ.. వ్యాపార పరంగా , హీరోలేని సినిమా నడవాలంటే కష్టమే. రుద్రమ దేవి పట్టాభిషేకం అప్పుడు.. ఎలాగైతే మహిళ ను సింహాసనంగా కూర్చపెట్టడానికి ప్రజలు మానసికంగా ఎలా సిద్దంగా ఉండరో… అలాగే సినిమా కథ అంతా హీరోయిన్ మీదనే నడిపి చూడమంటే కష్టమే. అందుకే దర్శకుడు గోన గన్నారెడ్డి […]
BY sarvi19 Oct 2015 12:33 AM IST
X
sarvi Updated On: 19 Oct 2015 5:43 AM IST
గుణశేఖర్ ఎంతో కాలంగా చేయాలనుకున్న హిస్టారికల్ డ్రామ రుద్రమదేవి. ఇటువంటి హిస్టారికల్ డ్రామ చేయాలనుకునే ఆయన ప్యాషన్ ను అభినందించ వచ్చు. కానీ.. వ్యాపార పరంగా , హీరోలేని సినిమా నడవాలంటే కష్టమే. రుద్రమ దేవి పట్టాభిషేకం అప్పుడు.. ఎలాగైతే మహిళ ను సింహాసనంగా కూర్చపెట్టడానికి ప్రజలు మానసికంగా ఎలా సిద్దంగా ఉండరో… అలాగే సినిమా కథ అంతా హీరోయిన్ మీదనే నడిపి చూడమంటే కష్టమే. అందుకే దర్శకుడు గోన గన్నారెడ్డి రూపంలో విలన్ కమ్ హీరోను సిద్దం చేసుకున్నాడు. ఈ చిత్రంలో చివరి వరకు గోన గన్నా రెడ్డి ప్రతి నాయకుడు అన్నట్లు చూపిస్తారు. బలమైన విలన్ అతనే అనిపిస్తుంది. అయితే చివరకు రియల్ హీరో కూడా గోన గన్నారెడ్డి అనే తేల్చడంలో.. దర్శకుడు చెప్పాలనుకున్న రుద్రమ దేవి సెకండిరి అయ్యింది. సెకండాఫ్ లో రుద్రమ దేవి తో చేయించిన కొన్ని సన్నివేశాలు.. గ్లామరస్ సాంగ్స్..ఆమే ఒక గొప్ప వారియర్ అనే ఫీలింగ్ తగ్గించే విధంగా వున్నాయి. స్క్రీన్ ప్లే లోపాలు ఎక్కువుగా వున్నాయి. మరింత పకడ్బంధీగా కథనం వుండి వుండే ఇప్పటికే బయ్యర్లు సేఫ్ జోన్ లో ఉండేవారు..! అసలు విషయం ఏమిటంటే..గోన గన్నా రెడ్డి రూపంలో బన్నీ కెరీర్ లోనే ఒక గొప్ప రోల్ చేశారు.
Next Story