రిటైర్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటించిన సెహ్వాగ్
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అధికారికంగా ట్విట్టర్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. సోమవారం రాత్రే సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారని దేశవ్యాప్తంగా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే వెంటనే సెహ్వాగ్ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇండియా వచ్చాక నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే చెప్పానంటూ మీడియా కథనాలపై నీళ్లు చల్లారు. ఇంతలోనే మంగళవారం ట్విట్లర్ ద్వారా రిటైర్‌మెంట్ ప్రకటించారు. సెహ్వాగ్ మొత్తం 104 టెస్టు మ్యాచ్‌లు, 251 వన్డేలు ఆడారు. టెస్టుల్లో […]
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అధికారికంగా ట్విట్టర్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. సోమవారం రాత్రే సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారని దేశవ్యాప్తంగా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే వెంటనే సెహ్వాగ్ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇండియా వచ్చాక నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే చెప్పానంటూ మీడియా కథనాలపై నీళ్లు చల్లారు. ఇంతలోనే మంగళవారం ట్విట్లర్ ద్వారా రిటైర్‌మెంట్ ప్రకటించారు.
సెహ్వాగ్ మొత్తం 104 టెస్టు మ్యాచ్‌లు, 251 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 8586 పరుగులు చేశారు. వన్డేల్లో 8273 పరుగులు కొల్లగొట్టారు. వన్డేల్లో 15 శతకాలు బాదాడు. వన్డెల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 219. టెస్టుల్లో 23 సెంచరీలు చేశాడు. మూడుసార్లు త్రిపుల్ సెంచరీ బాదాడు. సెహ్వాగ్ 19 టీ ట్వంటీ మ్యాచులు ఆడాడు. వీరేంద్రుడు తన ఆఖరి వన్డేను 2013లో పాకిస్తాన్‌తో ఆడారు. అదే ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడారు.