Telugu Global
Others

చంద్రబాబుకు నో చెప్పిన రాజమౌళి, బోయపాటి

నాలుగు వందల కోట్లతో… చరిత్ర చూడని, భవిష్యత్తులో దర్శించలేని స్ధాయిలో అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. కార్యక్రమం రోజు ప్రతి అడుగు రిచ్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఆహారం నుంచి కల్చరల్ ఈవెంట్ వరకు ఎక్కడా రాజీ పడడం లేదు. దేశంలోనే ఆయా రంగాల్లో ప్రసిద్ది చెందిన వారిని రంగంలోకి దింపారు. ఇందులో భాగంగా సభా వేదిక సెట్టింగ్ కూడా అదిరిపోవాలని చంద్రబాబు భావించారు. అలాంటి సెట్టింగ్‌ వేయగల మొనగాడు ఎవరని ఆలోచించారు. బాహుబలి రాజమౌళిని […]

చంద్రబాబుకు నో చెప్పిన రాజమౌళి, బోయపాటి
X

నాలుగు వందల కోట్లతో… చరిత్ర చూడని, భవిష్యత్తులో దర్శించలేని స్ధాయిలో అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. కార్యక్రమం రోజు ప్రతి అడుగు రిచ్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఆహారం నుంచి కల్చరల్ ఈవెంట్ వరకు ఎక్కడా రాజీ పడడం లేదు. దేశంలోనే ఆయా రంగాల్లో ప్రసిద్ది చెందిన వారిని రంగంలోకి దింపారు.

ఇందులో భాగంగా సభా వేదిక సెట్టింగ్ కూడా అదిరిపోవాలని చంద్రబాబు భావించారు. అలాంటి సెట్టింగ్‌ వేయగల మొనగాడు ఎవరని ఆలోచించారు. బాహుబలి రాజమౌళిని మించిన వ్యక్తి ఎవరున్నారన్న ఉద్దేశంతో వెంటనే ఆయనను ప్రభుత్వ వర్గాలు సంప్రదించాయట. అమరావతి వేదిక సెట్టింగ్ వేయాలని కోరారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ఓ తెలుగువాడిగా మీరూ పాలుపంచుకోండని మోహమాట పెట్టారని సమాచారం. అయితే రాజమౌళి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

ఆగి వేచి చూసే సమయం లేకపోవడంతో వెంటనే గోదావరి పుష్కరాల డైరెక్టర్ బోయపాటి శీను వైపు పరుగులు తీశారు. ఆయన కూడా వద్దు బాబోయ్ నన్ను వదిలేయండి అన్నట్టు సమాచారం. పుష్కరాల తొక్కిసలాటలో చంద్రబాబుతో కలిసి రెడీ 1, 2, 3 యాక్షన్ చెప్పి 30 మంది ప్రాణాలు పోవడానికి బోయపాటి కూడా కారణమేనన్న విమర్శలు రావడంతో ఈసారి ఆయన ముందుకు రాలేదని చెబుతున్నారు. దీంతో చేసేది లేక ప్రముఖ ఆర్ట్ క్యూరేటర్ రాజీవ్ సేథీని చంద్రబాబు తెరపైకి తెచ్చారు.

ప్రపంచదేశాల్లో పర్యటించడంతో పాటు, ప్రాచీన కళారూపాలపై మంచి అవగాహన ఉండడంతో రాజీవ్ సేథీకి స్టేజ్ సెట్టింగ్ బాధ్యత అప్పగించారు. అమరావతి ప్రాచీనత ఉట్టిపడేలా సెట్టింగ్ నిర్మించేందుకు గాను కోటి రూపాయలను చెల్లించనున్నారు.

తెలుగునాట జరుగుతున్న ఇంత పెద్ద ఈవెంట్‌లో ముఖ్యమంత్రి కోరినా తెలుగు డైరెక్టర్లు ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది. నిజంగా డైరెక్టర్లు బిజీగా ఉన్నారా లేక వందల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ఈవెంట్‌లో చేతులు పెట్టి అనవసరంగా విమర్శలు ఎదుర్కొవడం ఎందుకన్న భావనతో దూరంగా ఉన్నారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. అయినా చంద్రబాబే కోరినా వీరు లెక్కచేయలేదంటే ఆలోచించాల్సిన విషయమే.

First Published:  19 Oct 2015 6:24 AM IST
Next Story