60ఏళ్లొస్తే ఇంటికే!
కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియారిటీకి పెట్టింది పేరు. 85ఏళ్ల వయసులోనూ కాంగ్రెస్ లో చక్రం తిప్పే నేతలు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇక ముందు ఇలాంటి పరిస్థితి ఉండబోదంటున్నారు ఆపార్టీ సీనియర్ నేత జైరాం రమేష్. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించబోతున్నట్టు ఆయన చెప్పారు. పార్టీలో 60ఏళ్లు నిండిన నాయకులందర్నీ సలహాదారులుగా ఉపయోగించుకుంటామని జైరాం రమేష్ చెప్పారు. కానీ ప్రధాని నరేంద్రమోడీలా సీనియర్లను అవమానించబోమన్నారు. బీజేపీలో సీనియర్ నేతలు అయిన అద్వానీ, జస్వంత్ […]
కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియారిటీకి పెట్టింది పేరు. 85ఏళ్ల వయసులోనూ కాంగ్రెస్ లో చక్రం తిప్పే నేతలు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇక ముందు ఇలాంటి పరిస్థితి ఉండబోదంటున్నారు ఆపార్టీ సీనియర్ నేత జైరాం రమేష్. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించబోతున్నట్టు ఆయన చెప్పారు. పార్టీలో 60ఏళ్లు నిండిన నాయకులందర్నీ సలహాదారులుగా ఉపయోగించుకుంటామని జైరాం రమేష్ చెప్పారు. కానీ ప్రధాని నరేంద్రమోడీలా సీనియర్లను అవమానించబోమన్నారు. బీజేపీలో సీనియర్ నేతలు అయిన అద్వానీ, జస్వంత్ సింగ్, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా లాంటి నాయకులను మోడీ తొక్కేశారని జైరాం రమేష్ అన్నారు. రాహుల్ టీమ్ లో ఉండబోయే నాయకులంతా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారే ఉంటారన్నారు.
ఇందుకోసం ఇప్పటికే రాహుల్ దేశ వ్యాప్తంగా తనకు ఉపయోగపడే నాయకుల లిస్ట్ తయారు చేశారు. ఇదివరకే వారిని ఢిల్లీ పిలిపించి యువ నాయకులతో చర్చించారు. అలా వెళ్లిన నాయకుల్లో తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు, సంపత్ కుమార్, పొన్నం ప్రభాకర్ తోపాటు మరో నలుగురు నాయకులు ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలోనూ యువ రక్తానికి పెద్దపీట వేయబోతున్నారన్నమాట.