అమరావతి వద్ద వాతావరణం ఎలా ఉంది?
అమరావతి శంకుస్థాపనకు కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తున్న వేళ దట్టమైన మేఘాలు అధికారులను మధ్యమధ్యలో భయపెడుతున్నాయి. ఆదివారం సాయంత్రం దట్టమైన మేఘాలు అమరావతి సమీపంలో కమ్ముకోవడంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే వర్షం మాత్రం కురవకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ అధికారులను సంప్రదించి వర్షసూచనలను అడిగి తెలుసుకుయే ప్రయత్నం చేశారు. వచ్చే నాలుగు రోజుల పాటు వేడి, గాలిలో అధిక తేమ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వర్షం వచ్చే సూచనలు ప్రత్యేకంగా […]
అమరావతి శంకుస్థాపనకు కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తున్న వేళ దట్టమైన మేఘాలు అధికారులను మధ్యమధ్యలో భయపెడుతున్నాయి. ఆదివారం సాయంత్రం దట్టమైన మేఘాలు అమరావతి సమీపంలో కమ్ముకోవడంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే వర్షం మాత్రం కురవకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ అధికారులను సంప్రదించి వర్షసూచనలను అడిగి తెలుసుకుయే ప్రయత్నం చేశారు. వచ్చే నాలుగు రోజుల పాటు వేడి, గాలిలో అధిక తేమ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వర్షం వచ్చే సూచనలు ప్రత్యేకంగా ఏమి లేవని చెప్పినట్టు తెలుస్తోంది.
ఒక వేళ వర్షం వస్తే మాత్రం ఇప్పటి వరకుచేసిన ఏర్పాట్లు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పైగా శుంకుస్థాపన కోసం చదును చేసిన ప్రాంతమంతా మొత్తటి మట్టితో కూడినది. వర్షం వస్తే బురదమయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ప్రస్తుతం వేసిన రోడ్లు కూడా పాడవుతాయని ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా గట్టి రోడ్ల కోసం కంకరతో వేయాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల రోడ్లను ఎర్రటి మట్టితో వేశారు. దీని వల్ల వర్షం వస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. అయితే వాతావరణ శాఖ సూచనలతో ప్రభుత్వం, అధికారులు ధైర్యంగా ఉన్నారు.