Telugu Global
CRIME

త‌ల‌కిందులుగా వేలాడదీసి..కొట్టి చంపారు!

సినిమాల ప్ర‌భావ‌మో.. ఉగ్ర‌వాదుల నుంచి నేర్చుకుంటున్న దుర్గుణాలో గానీ కొంద‌రు మ‌నుషులు సాటి మ‌నుషుల‌ప‌ట్ల రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దొంగ‌త‌నం చేశాడ‌న్న అనుమానంతో ఓ కూలిని త‌ల‌కిందులుగా క‌ట్టేసి ఇనుప రాడ్‌తో కొట్టి, ప్రాణాలు పోయేదాకా హింసించి చంపారు. ఇది ఏ ఇరాక్, సిరియాలో ఐఎస్ ఉగ్ర‌వాదుల సాగించిన వికృత క్రీడ కాదు, సాక్షాత్తు భార‌తీయులే ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్‌నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  వివ‌రాలు.. బీహార్‌కు చెందిన రామ్ అనే […]

సినిమాల ప్ర‌భావ‌మో.. ఉగ్ర‌వాదుల నుంచి నేర్చుకుంటున్న దుర్గుణాలో గానీ కొంద‌రు మ‌నుషులు సాటి మ‌నుషుల‌ప‌ట్ల రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దొంగ‌త‌నం చేశాడ‌న్న అనుమానంతో ఓ కూలిని త‌ల‌కిందులుగా క‌ట్టేసి ఇనుప రాడ్‌తో కొట్టి, ప్రాణాలు పోయేదాకా హింసించి చంపారు. ఇది ఏ ఇరాక్, సిరియాలో ఐఎస్ ఉగ్ర‌వాదుల సాగించిన వికృత క్రీడ కాదు, సాక్షాత్తు భార‌తీయులే ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్‌నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.
వివ‌రాలు.. బీహార్‌కు చెందిన రామ్ అనే కూలి అమృత్‌స‌ర్‌లోని జ‌స్ ప్రీత్‌సింగ్ ఫ్యాక్టరీలో ప‌నిచేస్తున్నాడు. దొంగ‌త‌నం చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో రామ్‌ను జ‌స్ ప్రీత్ సింగ్ అత‌ని అనుచ‌రులు గురువారం రాత్రి గుర్తు తెలియ‌ని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్క‌డ త‌ల‌కిందులుగా తాడుతో వేలాడ‌దీశారు. ఇనుప‌రాడ్ల‌తో గొడ్డును బాదిన‌ట్లు బాదారు. చ‌ర్మం ప‌గిలి ర‌క్తాలు కారుతున్నా.. ఆపమంటూ రామ్ ఆర్త‌నాదాలు చేసినా.. వారు క‌నిక‌రించ‌లేదు. పైగా బాధితుడిని పంజాబీ బాష‌లో తిడుతూ ఉన్మాదుల్లా విరుచుకుప‌డ్డారు. ఈ త‌తంగ‌మంతా మ‌రో ఉన్మాది త‌న మొబైల్ ఫోన్‌లో చిత్రీక‌రించాడు. వారి దెబ్బ‌లు తాళ‌లేక ఆ అనామ‌కుడు చివ‌రికి ప్రాణాలు విడిచాడు. శుక్ర‌వారం ఉద‌యం రామ్ మృత‌దేహం వెలుగుచూసింది. దాదాపు 47 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సామాజిక వెబ్‌సైట్ల‌లో విప‌రీతంగా షేర్ అవుతోంది. నిందితులు అచ్చంగా ఐఎస్ ఉగ్ర‌వాదుల్లానే ప్ర‌వ‌ర్తించార‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఫ్యాక్ట‌రీ య‌జ‌మానిపై హ‌త్యానేరం న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
First Published:  17 Oct 2015 6:30 PM IST
Next Story