అయినా బాబు మారలేదు
2004లో అధికారం కోల్పోయిన తర్వాత పదేళ్ల పాటు ప్రతిక్షణం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పశ్చత్తాపాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. సీఎంగా తాను నేల విడిచి సాము చేశానని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని కనిపించి ప్రతి టీవీ కెమెరా ముందు ఒప్పుకున్నారు. ఈసారి అవకాశం ఇస్తే వ్యవసాయాన్ని కనీవినీ ఎరుగుని రీతిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ వచ్చారు. ఆ మాటలకు ముందస్తు హామీ అన్నట్టు అధికారంలోకి రాగానే రైతులు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని ప్రకటించారు. […]
2004లో అధికారం కోల్పోయిన తర్వాత పదేళ్ల పాటు ప్రతిక్షణం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పశ్చత్తాపాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. సీఎంగా తాను నేల విడిచి సాము చేశానని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని కనిపించి ప్రతి టీవీ కెమెరా ముందు ఒప్పుకున్నారు. ఈసారి అవకాశం ఇస్తే వ్యవసాయాన్ని కనీవినీ ఎరుగుని రీతిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ వచ్చారు. ఆ మాటలకు ముందస్తు హామీ అన్నట్టు అధికారంలోకి రాగానే రైతులు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని ప్రకటించారు. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం అని నమ్మిన రైతులు మొన్నటి ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని అప్పగించారు. కానీ చంద్రబాబు పాత బాబేనని ఆయన శుక్రవారం ఇచ్చిన ఇంటర్య్యూ బట్టి అర్థమైపోయిందని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన పబ్లిసిటీలో భాగంగా మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్న చంద్రబాబు శుక్రవారం తన మనసులో మాట బయటపెట్టారు. ఒక మీడియా సంస్థకిచ్చిన సుధీర్ఘ ఇంటర్య్యూలో తన తొలిప్రాధాన్యత ఐటీకేనని పాత పాటే పాడారు. ఐటీ తర్వాత కూడా వ్యవసాయం పేరెత్తలేదు. ఐటీ తర్వాత రెండో ప్రాధన్యత టూరిజమని మనసులోని అసలు మాట బయటపెట్టారు. రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా చేస్తానంటూనే ఐటీ, హైటెక్ సిటీ అంటూ హైఫైగా మాట్లాడారు. బహుషా రాష్ట్రంలో వ్యవసాయమే లేకుండా చేస్తే రాష్ట్రం కరువు రహితమవుందని బాబు భావిస్తున్నారా అన్న అనుమానాన్ని ఆయన ఇంటర్వ్యూను చూపిన వారు వ్యక్తం చేశారు.
చంద్రబాబు మన సామాజికపరిస్థితులకు అనువుగా ఆలోచించడం లేదన్నది ఆయన చెప్పిన మరో విషయం బట్టి అర్థమవుతుంది. అమరావతిలో రోడ్లపక్కన కాలువలు తవ్వించి పడవ ప్రయాణం పెడుతారట. ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అయితే ఐటీ ఉద్యోగులు ఎంచక్కా బోటు వేసుకుని ఆఫీసుకు వెళ్లవచ్చంటూ కాసేపు పారిస్‌కు తీసుకెళ్లారు.
కొద్ది రోజుల క్రితం కూడా జలాంతర్గత రహదారి నిర్మిస్తామని చెప్పి చాలా మందికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు ఎక్కువ అవడం వల్లే ఈ సమస్యలొస్తున్నాయని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఒక దేశంలో ఏదైనా కొత్తగా కనిపిస్తే వెంటనే అదే తరహా నిర్మాణం అమరావతిలోనూ కట్టేస్తామని బాబు ప్రకటిస్తున్నారని పెదవి విరుస్తున్నారు.