చెర్రీకి కనీసం ఆ కల కూడా నెరవేరలేదు..?
బ్రూస్ లీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు రామ్ చరణ్. టాలీవుడ్ లో రికార్డులు సృష్టించే సినిమాగా నిలపాలనుకున్నాడు. కానీ తెలుగు తెరపై అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇక ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరవ్వాలనుకున్నాడు. ప్రస్తుత టాక్ చూస్తుంటే అది కూడా వర్కవుట్ అయ్యేలా లేదు. చివరికి బ్రూస్ లీతో తన కోలీవుడ్ కలను కూడా నెరవేర్చుకోలేకపోయాడు రామ్ చరణ్. కోలీవుడ్ లో తనకంటూ ఓ పేరుతెచ్చుకోవాలని ఎప్పట్నుంచో విశ్వప్రయత్నం చేస్తున్నాడు […]
BY sarvi18 Oct 2015 2:30 AM IST
X
sarvi Updated On: 19 Oct 2015 8:36 AM IST
బ్రూస్ లీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు రామ్ చరణ్. టాలీవుడ్ లో రికార్డులు సృష్టించే సినిమాగా నిలపాలనుకున్నాడు. కానీ తెలుగు తెరపై అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇక ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరవ్వాలనుకున్నాడు. ప్రస్తుత టాక్ చూస్తుంటే అది కూడా వర్కవుట్ అయ్యేలా లేదు. చివరికి బ్రూస్ లీతో తన కోలీవుడ్ కలను కూడా నెరవేర్చుకోలేకపోయాడు రామ్ చరణ్.
కోలీవుడ్ లో తనకంటూ ఓ పేరుతెచ్చుకోవాలని ఎప్పట్నుంచో విశ్వప్రయత్నం చేస్తున్నాడు చెర్రీ. అప్పుడెప్పుడో వచ్చిన మగధీర తమిళ వెర్షన్ రామ్ చరణ్ కు తమిళ తంబీల్లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. కానీ తర్వాత ఆరెంజ్ సినిమా నుంచి మొన్నటి గోవిందుడు అందరివాడేలే మూవీ వరకు ఏ ఒక్క సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. గోవిందుడు అందరివాడేలే సినిమాను రామ్ లీలా పేరుతో తమిళనాట విడుదల చేశారు. టైటిల్ తోపాటు, కాజల్ కూడా తమిళ జనాల్ని ఆకర్షించలేదు. ఇప్పుడు బ్రూస్ లీ కూడా అదే బాటలో నడిచింది. తమిళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాలో నదియా, సంపత్ రాజ్, అరుణ్ విజయ్ లాంటి తారాగణం, తమన్ లాంటి సంగీత దర్శకుడు ఉన్నప్పటికీ బ్రూస్ లీ తమిళనాట ఫ్లాప్ గా మిగిలింది.
అయితే బ్రూస్ లీ తమిళనాట ఫ్లాప్ అయి విషయం చెర్రీని బాధించడం లేదు. అక్కడ బ్రూస్ లీ కంటే రుద్రమదేవి సినిమాను ఎక్కువమంది చూస్తున్నారు. ఇదే చెర్రీని తీవ్రంగా కలిచివేస్తోంది. సో.. చెర్రీ కోలీవుడ్ డ్రీమ్స్ నెరవేరాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
Next Story