బీజేపీని కదిలించిన బీఫ్ కామెంట్లు
బీఫ్ కలకలంపై ఎట్టకేలకు బీజేపీ కదిలింది. హరియానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ , ఎంపీ సాక్షి మహారాజ్, సంగీత్ సోమ్ తదిరులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నోటీసులు జారీ చేశారు. బీఫ్ తినే ముస్లింలు పాకిస్తాన్ వెళ్లాలనడం, గోవధ విషయంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే! ఇక సాహిత్య లోకమైతే తమకు ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తూ..మోదీ ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేస్తున్నా.. ఆర్ ఎస్ ఎస్ నేపథ్యమున్న […]
BY sarvi18 Oct 2015 10:15 AM IST
X
sarvi Updated On: 19 Oct 2015 9:19 AM IST
బీఫ్ కలకలంపై ఎట్టకేలకు బీజేపీ కదిలింది. హరియానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ , ఎంపీ సాక్షి మహారాజ్, సంగీత్ సోమ్ తదిరులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నోటీసులు జారీ చేశారు. బీఫ్ తినే ముస్లింలు పాకిస్తాన్ వెళ్లాలనడం, గోవధ విషయంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే! ఇక సాహిత్య లోకమైతే తమకు ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తూ..మోదీ ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేస్తున్నా.. ఆర్ ఎస్ ఎస్ నేపథ్యమున్న బీజేపీ జాతీయ ఎంపీలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఓవైపు బీహార్‌లో బీజేపీ విజయం మోదీ చరిష్మాతో ముడిపడటం ఉండటంతో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని ఎట్టకేలకు అధిష్టానం గ్రహించింది. ఇందులో భాగంగానే వివాదాదస్పద కామెంట్లు చేసిన వారికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
బీజేపీ నేతల తీరుతో మోదీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని సమాచారం. ఇంకోవైపు శివసేన ఇటీవల గుజరాత్ అల్లర్లతోనే మోదీకి గుర్తింపు లభించిందని చురకలంటించడంతో మరోసారి గోద్రా మారణకాండ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇవే అంశాలు బీహార్ ఎన్నికల్లో నితీశ్‌కు ఆయుధాలుగా, బీజేపీకి ప్రతికూలాంశాలుగా మారాయి. లౌకిక కూటమిగా పేరొందిన జేడీయూ- కాంగ్రెస్ మిత్రపక్షాలు బీజేపీ నేతలను మతతత్వ వాదులుగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలస్యంగా కళ్లు తెరిచిన బీజేపీ ఎంపీల నోర్లకు కళ్లెం వేయాలని చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ తాఖీదులు జారీ చేశారు. దీనిపై సంఘ్‌పరివార్, ఆర్ ఎస్ ఎస్ ఎలా స్పందిస్తాయో చూడాలి మరి!
Next Story