Telugu Global
Others

కేసీఆర్ వెళ్తారా? మంత్రిని పంపుతారా? 

అమరావతి నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముహూర్తం కూడా ముంచుకోస్తోంది. ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులతోపాటు ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమంలో ఏపీ మంత్రులు, అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పుడు అందరి చూపూ, అన్ని దారులూ అమరావతి వైపే. శంకుస్థాపనకు రారండీ అంటూ అమరావతి ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపైనే ఉంది. శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆదివారం ఆయన కేసీఆర్ ను కలిసి […]

కేసీఆర్ వెళ్తారా? మంత్రిని పంపుతారా? 
X

అమరావతి నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముహూర్తం కూడా ముంచుకోస్తోంది. ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులతోపాటు ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమంలో ఏపీ మంత్రులు, అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పుడు అందరి చూపూ, అన్ని దారులూ అమరావతి వైపే. శంకుస్థాపనకు రారండీ అంటూ అమరావతి ఆహ్వానిస్తోంది.
ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపైనే ఉంది. శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆదివారం ఆయన కేసీఆర్ ను కలిసి స్వయంగా ఆహ్వానిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరుఫు ఎవరు వెళ్తున్నారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎవరో ఒకరైతే వెళ్లడం ఖాయం. అది కేసీఆరా లేక మంత్రుల్లో ఎవరో ఒకరా అన్నదే తెలియడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం వస్తే వెళ్లి ఆశీర్వదించి వస్తామని ఇప్పటికే మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. విజయదశమి రోజే అమరావతికి శంకుస్ధాపన కార్యక్రమం ఉంది. అదే రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు.
యాదాద్రి విస్తరణ పనులను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆరోజు బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన వెళ్లడం కష్టమన్న ప్రచారం జరుగుతోంది.
అయితే మరికొందరు మాత్రం కేసీఆర్ అమరావతి వెళ్లాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంగా విడిపోయినా తెలుగు వారిగా అభివృద్ధి చెందుతున్నామన్న భావన కల్పించినట్టు అవుతుందని… అందుకే కేసీఆర్ వెళ్తారని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ శంకుస్థాపనకు వెళ్లనని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ అమరావతి వెళ్లడం ద్వారా హైదరాబాద్ లో ఉండే తెలుగువాళ్ల దృష్టిలో మంచివాడవుతారంటున్నారు.
ఇక కేసీఆర్ వెళ్లలేని పరిస్థితుల్లో మంత్రులు కేటీఆర్‌, హరీష్ గానీ, డిప్యూటీ సీఎం తుమ్మల నాగేశ్వరరావును కానీ పంపే అవకాశం ఉందట. మొత్తం మీద అమరావతి శంకుస్థాపనకైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు వెళ్లడం మాత్రం ఖాయం.

First Published:  17 Oct 2015 4:45 AM IST
Next Story