ప్లాట్‌ఫారమ్ టికెట్ ధర రూ.20
మీరు చదువున్నతది నిజమే! రద్దీని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలన్న దక్షిణ మధ్య రైల్వే ఆలోచనలో నుంచే ఈ ఐడియా పుట్టుకొచ్చింది. దసరా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ కాబట్టి ప్లాటఫారమ్ టికెట్ ధరను రెండింతలు చేసింది. ప్రస్తుతం రూ.10 ఉన్న వెల ఏకంగా రూ.20 లకు పెంచింది. అయితే, ఈ ధర కేవలం సికింద్రాబాద్ స్టేషన్‌కు మాత్రమే పరిమితం చేసింది. శనివారం నుంచి ఈ నెల 26 వరకు అంటే దసరా సెలవులు ముగిసేవరకు ఈ ధరలు […]
BY admin16 Oct 2015 1:03 PM GMT
X
admin Updated On: 17 Oct 2015 1:26 AM GMT
మీరు చదువున్నతది నిజమే! రద్దీని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలన్న దక్షిణ మధ్య రైల్వే ఆలోచనలో నుంచే ఈ ఐడియా పుట్టుకొచ్చింది. దసరా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ కాబట్టి ప్లాటఫారమ్ టికెట్ ధరను రెండింతలు చేసింది. ప్రస్తుతం రూ.10 ఉన్న వెల ఏకంగా రూ.20 లకు పెంచింది. అయితే, ఈ ధర కేవలం సికింద్రాబాద్ స్టేషన్‌కు మాత్రమే పరిమితం చేసింది. శనివారం నుంచి ఈ నెల 26 వరకు అంటే దసరా సెలవులు ముగిసేవరకు ఈ ధరలు అమలులో ఉంటాయి. సాధారణ రోజుల్లో ఈ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ టికెట్లు రోజుకు 15 వేల వరకు విక్రయిస్తుంటారు. దసరా, దీపావళి లాంటి పండగల నేపథ్యంలో వీటి సంఖ్య 25 వేలు దాటుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రమణకుమార్ తెలిపారు. మామూలు రోజుల్లో టికెట్‌కు రూ.10 వసూలు చేస్తారు. దానికి ఒక రోజు ఆదాయం కింద రూ.1.5 లక్షల ఆదాయం వస్తుంది. కానీ, రూ.20 చొప్పున విక్రయిస్తే.. ఒక రోజుకు దాదాపు రూ.5లక్షల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఈ నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ఏడాది రూ.5 ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.10 చేశారు. పండగ పేరు చెప్పి ఉన్నపలంగా రూ.20 చేస్తే ఎలా అని విరుచుకుపడుతున్నారు.
కారణం అదేనా?
సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రస్తుతం వై-ఫై ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి మొబైల్ ఫోన్‌కు 30 నిమిషాల పాటు ఉచితంగా వై-ఫై అందిస్తున్నారు. ఇప్పడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. అందులో 2-3 సిమ్‌లు వాడుతున్నారు. అంటే ఒక మొబైల్ నుంచి దాదాపు గంటకు పైగానే ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. ప్రయాణికులతోపాటు వారిని రైలు ఎక్కించేందుకు, వచ్చిన బంధువులను రిసీవ్ చేసుకునేందుకు పండగ రోజుల్లో దాదాపు 25 వేలమంది అదనంగా వస్తారు. వీరంతా స్మార్ట్‌ఫోన్లతో వై-ఫై వాడతారు. వీరందరికి ఉచితంగా వై-ఫై ఇవ్వడం భారంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు ప్రయాణికులు మండిపడుతున్నారు.
Next Story