బాబును ఇరికించేసిన జయ
రాజధాని శంకుస్థాపనకు అందరు సీఎంలను ఆహ్వానించి తన మేనేజ్‌మెంట్ స్కిల్స్ ప్రదర్శించాలనుకున్న చంద్రబాబుకు తమిళనాడు సీఎం జయలలిత పెద్ద పరీక్షే పెట్టారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా జయను ఆహ్వానించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న వేళ.. ఆమె నుంచి ఒక లేఖ ఏపీ ప్రభుత్వానికి వచ్చింది. ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన 516 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీలను వెంటనే విడుదల చేయాలన్నది ఆ లేఖ సారాంశం. అరెస్టయిన తమిళ కూలీలంతా బెయిల్ పొందేందుకు అర్హులేనని కాబట్టి […]
రాజధాని శంకుస్థాపనకు అందరు సీఎంలను ఆహ్వానించి తన మేనేజ్‌మెంట్ స్కిల్స్ ప్రదర్శించాలనుకున్న చంద్రబాబుకు తమిళనాడు సీఎం జయలలిత పెద్ద పరీక్షే పెట్టారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా జయను ఆహ్వానించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న వేళ.. ఆమె నుంచి ఒక లేఖ ఏపీ ప్రభుత్వానికి వచ్చింది. ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన 516 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీలను వెంటనే విడుదల చేయాలన్నది ఆ లేఖ సారాంశం. అరెస్టయిన తమిళ కూలీలంతా బెయిల్ పొందేందుకు అర్హులేనని కాబట్టి వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఇప్పుడిదే చంద్రబాబుకు సంకట పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఎర్రచందనం కూలీలను విడుదల చేయాలని జయ కోరినందున దానిపై నిర్ణయం తీసుకోకుండా ఆమెను శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు వెళ్లడం చూసేందుకు బాగోదు. ఒక వేళ జయ కోరినట్టు ఎర్రకూలీలను విడుదల చేస్తే అప్పుడు అది మరో వివాదంగా మారే అవకాశం ఉంటుంది. రాజధాని శంకుస్థాపన వైభవాన్ని జయలలితకు కూడా చూపించే ఉద్దేశంతోనే ఎర్రకూలీలను వదిలేశారన్న విమర్శలు తప్పక వస్తాయి.
అసలు ఏపీ రాజధాని శంకుస్థాపనకు హాజరయ్యే విషయంలో జయ సర్కార్ విముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం శేషాచలం అడవుల్లో ఏకంగా 20 మంది తమిళ ఎర్రచందనం కూలీలను చంద్రబాబు సర్కర్ ఎన్‌కౌంటర్ చేసింది. అప్పట్లో ఎన్‌కౌంటర్ పెద్ద దుమారం రేపింది. అప్పటి నుంచి తమిళులు చంద్రబాబుపై కోపం పెంచుకున్నారు. ఈనేపథ్యంలో ఏపీ రాజధాని శంకుస్థాపనకు జయ హాజరవడం వల్ల అక్కడ ఆమెకు రాజకీయంగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే కార్యక్రమానికి హాజరయ్యే ముందు ఇలా ఎర్రచందనం కూలీలను విడుదల చేయాలంటూ జయ లేఖ రాసిందని భావిస్తున్నారు.
Also Read : బాబు రెండు జిల్లాలకే ముఖ్యమంత్రా ?
ఆ విషయంలో ఒబామాను బాబు బీట్ చేశారట!