Telugu Global
Others

చంద్రబాబు తెలంగాణాలో మట్టి వివాదం రేపుతారా ?

అమరావతి నిర్మాణం కోసం ప్రజల్లో స్పూర్తి రగిల్చేందుకంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ”మన మట్టి – మన నీరు” కార్యక్రమం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల నుంచి పుట్టమట్టి, మంచినీరు సేకరించి అమరావతికి టీడీపీ శ్రేణులు తరలిస్తున్నాయి. ఈ కార్యక్రమం పబ్లిసిటీకి బాగా ఉపయోగపడడంతో మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ఏపీలోని గ్రామాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రముఖులు పుట్టిన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని తీసుకురావాల్సిందిగా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారని సమాచారం. […]

చంద్రబాబు తెలంగాణాలో మట్టి వివాదం రేపుతారా ?
X

అమరావతి నిర్మాణం కోసం ప్రజల్లో స్పూర్తి రగిల్చేందుకంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ”మన మట్టి – మన నీరు” కార్యక్రమం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల నుంచి పుట్టమట్టి, మంచినీరు సేకరించి అమరావతికి టీడీపీ శ్రేణులు తరలిస్తున్నాయి. ఈ కార్యక్రమం పబ్లిసిటీకి బాగా ఉపయోగపడడంతో మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.

ఏపీలోని గ్రామాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రముఖులు పుట్టిన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని తీసుకురావాల్సిందిగా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారని సమాచారం. తెలంగాణలోని పుణ్యక్షేత్రాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయట. భద్రాచలం, యాదాద్రి, అలంపూర్, హైదరాబాద్ మక్కా మసీదు, మెదక్ చర్చి నుంచి మట్టిని తీసుకురావాల్సిందిగా ఆదేశించారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలకు కొత్త అనుమానం బయలుదేరింది. అదేంటంటే…

సాధారణంగా మట్టిని జనం చాలా పవిత్రంగా భావిస్తున్నారు. పక్కఊరి వాళ్లు వచ్చి సెంటిమెంట్ కార్యక్రమాలకు మీ ఊరి మట్టిని తీసుకెళ్తామంటే ఎవరూ అంగీకరించరు. ఎందుకంటే మట్టిని కూడా ఒక పవర్‌గా చాలా మంది భావిస్తుంటారు. ఇప్పటి వరకు ఇలా ఒక గ్రామం నుంచి మట్టిని తీసుకెళ్లి మరో చోట పొగేసిన దాఖలు కూడా పెద్దగా కనిపించవు. కానీ చంద్రబాబు సెంటిమెంట్‌ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ శ్రేణుల పనిని ఎదురించకుండా మౌనంగా ఉండిపోయారు.

కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మట్టి తీసుకెళ్తామంటే అక్కడి వారు అంగీకరిస్తారా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. సాధారణంగా పుణ్యక్షేత్రాల నుంచి జలాలు తీసుకెళ్లే సంప్రదాయం గురించే ఎక్కువగా విన్నాం. ఇలా పుట్టమట్టి అంటూ కార్యక్రమం చేయడం బహుషా ఇదే తొలిసారి కాబోలు. అయినా మూడ నమ్మకాలను ప్రోత్సహించవద్దని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. కానీ అదే రాజ్యంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు… నిత్యం ఐటీ గురించి మాట్లాడే చంద్రబాబు ఇలా పుట్ట మట్టి మంచి నీరు అంటూ మూడ నమ్మకాలను ప్రోత్సహించడం నిజంగా ఆందోళనకరమే.

First Published:  16 Oct 2015 10:24 AM IST
Next Story