మగవాళ్ళ కళ్ళు పడకుండా ఉండేందుకు...
వయసుతోబాటు అమ్మాయిల్లో సహజంగా పెరిగే ఛాతిని నియంత్రించడమే ఈ ఆటవిక పద్ధతి. వక్షోజాలను అణిచివేసి అమ్మాయిలపై కన్ను పడకుండా చేయడం అక్కడ ఆనవాయితీ. ప్రపంచంలో ఇలాంటి పద్ధతి ఒకటి ఉంటుందని ఊహిస్తేనే మనసు చివుక్కుమంటుంది… కేమరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికాల్లో ఈ పద్ధతి అమల్లో ఉంది. బ్రెస్ట్ ఐరనింగ్ అని పిలిచే ఈ ప్రక్రియలో ఛాతి కనిపించకుండా అణచివేస్తే ఆడపిల్లల వయసు దాచిపెట్టడంతో బాటు, వారి మీద మగవాళ్ల కన్ను పడకుండా ఉండేందుకు ఈ ఆటవిక పద్దతిని […]
BY admin15 Oct 2015 6:44 PM IST

X
admin Updated On: 16 Oct 2015 4:49 PM IST
వయసుతోబాటు అమ్మాయిల్లో సహజంగా పెరిగే ఛాతిని నియంత్రించడమే ఈ ఆటవిక పద్ధతి. వక్షోజాలను అణిచివేసి అమ్మాయిలపై కన్ను పడకుండా చేయడం అక్కడ ఆనవాయితీ. ప్రపంచంలో ఇలాంటి పద్ధతి ఒకటి ఉంటుందని ఊహిస్తేనే మనసు చివుక్కుమంటుంది… కేమరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికాల్లో ఈ పద్ధతి అమల్లో ఉంది. బ్రెస్ట్ ఐరనింగ్ అని పిలిచే ఈ ప్రక్రియలో ఛాతి కనిపించకుండా అణచివేస్తే ఆడపిల్లల వయసు దాచిపెట్టడంతో బాటు, వారి మీద మగవాళ్ల కన్ను పడకుండా ఉండేందుకు ఈ ఆటవిక పద్దతిని అవలంబిస్తున్నారు. ఈ అనాగరిక మూఢ నమ్మకంలో తల్లులే ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ నివేదిక పేర్కొంది. తమ పిల్లలకు బ్రెస్ట్ ఐరనింగ్ చేస్తే లైంగిక వేధింపులు, అత్యాచారాల నుంచి రక్షణ కలుగుతుందన్న మూఢనమ్మకమేకారణమట.
ఐరనింగ్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3.8 మిలియన్ల మంది ఎన్నో ఇబ్బందులకు గురై నరకం చూస్తున్నట్టు యూఎన్ నివేదిక పేర్కొంది. ఆడతనాన్ని ప్రతిబింబించే ఛాతి పెరగనీయకుండా ఉండేందుకు తల్లులు ఆశ్రయిస్తున్న అనాగరిక పద్దతి దారుణంగా ఉందని యునైటెడ్ నేషన్స్ అభిప్రాయపడింది. వక్షోజాలు కప్పివేసే సైజు రాళ్లు లేదా వెడల్పాటి గరిటె లాంటి దాన్ని బొగ్గుల మీద కాల్చి వాటితో ఛాతిని అణిచేస్తారట. ఈ పద్ధతిలో బ్రెస్ట్ టిష్యూ దారుణంగా దెబ్బ తినడం వల్ల ఆడతనం అణిగిపోతుందనేది తల్లుల నమ్మకం.
కామెరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆనాగరిక క్రతువులో 58 శాతం తల్లులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డబ్బున్న కుటుంబాలకు చెందిన యువతులైతే వెడల్పాటి బెల్టు గట్టిగా చుట్టుకుంటారట. దీని కారణంగా ఛాతి పెరగదట. ముఖ్యంగా 11, 15 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లల్లో శరీర భాగాలు పురుషుల కంట బడనీయక పోతే మగాళ్ళ కళ్ళు తమ పిల్లల మీద పడవని ఆ తల్లుల నమ్మకం. మహిళల మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతున్న ఈ అనాగరికపు ఆచారం మీద ఇప్పుడిప్పుడే చైతన్యం ప్రారంభమైంది.
Next Story