Telugu Global
Others

కాల్‌డ్రాప్‌కు రూపాయి క‌ట్టాల్సిందే! 

సెల్ నెట్‌వ‌ర్క్‌ల మ‌ధ్య నెల‌కొన్న పోటీ కార‌ణంగా ఉచిత సిమ్‌.. టాక్‌టైమ్‌లు ప్ర‌క‌టించి కొన్ని కంపెనీలు సిమ్‌లు అంట‌గ‌డుతున్నాయి. వీటిని తీసుకున్న వినియోగ‌దారుల బ్యాలెన్స్‌కు చిల్లు ప‌డుతోంది. ఎలాగంటే.. ఉచిత సిమ్ అని తీసుకుంటారు.. కొంత టాక్‌టైమ్ కూడా వ‌స్తుంది. త‌రువాత మీరు రీఛార్జి చేసుకోగానే మొద‌ల‌వుతుంది అస‌లు క‌థ‌. అవ‌త‌లి ఫోన్ లిఫ్ట్ చేయ‌గానే కాల్ క‌ట్ అవుతంది.. ఇలా రోజులో చాలా సార్లు జ‌రుగుతుంది. నిమిషంలో పూర్త‌య్యే కాల్‌కు 10 సార్లు ఫోన్ చేయాల్సిన […]

కాల్‌డ్రాప్‌కు రూపాయి క‌ట్టాల్సిందే! 
X
సెల్ నెట్‌వ‌ర్క్‌ల మ‌ధ్య నెల‌కొన్న పోటీ కార‌ణంగా ఉచిత సిమ్‌.. టాక్‌టైమ్‌లు ప్ర‌క‌టించి కొన్ని కంపెనీలు సిమ్‌లు అంట‌గ‌డుతున్నాయి. వీటిని తీసుకున్న వినియోగ‌దారుల బ్యాలెన్స్‌కు చిల్లు ప‌డుతోంది. ఎలాగంటే.. ఉచిత సిమ్ అని తీసుకుంటారు.. కొంత టాక్‌టైమ్ కూడా వ‌స్తుంది. త‌రువాత మీరు రీఛార్జి చేసుకోగానే మొద‌ల‌వుతుంది అస‌లు క‌థ‌. అవ‌త‌లి ఫోన్ లిఫ్ట్ చేయ‌గానే కాల్ క‌ట్ అవుతంది.. ఇలా రోజులో చాలా సార్లు జ‌రుగుతుంది. నిమిషంలో పూర్త‌య్యే కాల్‌కు 10 సార్లు ఫోన్ చేయాల్సిన ప‌రిస్థితి. దీంతో మ‌నం 10కాల్స్‌కు చేయాల్సిన టాక్‌టైం అయిపోతుంది. ఇదేదో సాంకేతిక స‌మ‌స్య‌కాదు. కావాల‌ని సెల్ కంపెనీలు వేస్తున్న ఎత్తుగ‌డ‌. ఎందుకంటే.. ఉచితంగా సిమ్ ఇచ్చారు క‌దా! మ‌రి దాని వెల + లాభం క‌లిపి లాగాలంటే.. ఇలాంటి కాల్ డ్రాప్‌లు త‌ప్ప‌వు మ‌రి! దేశంలోని ముఖ్య‌న‌గ‌రాల్లో ఈ జాడ్యం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌లో 100 మీట‌ర్ల ప‌రిధిలో ఉన్న వ్య‌క్తికి ఫోన్ చేసినా సిగ్న‌ల్ దొర‌క‌దు. వారిద్ద‌రూ ఒకే సెల్ ట‌వ‌ర్ కింద ఉండి మాట్లాడినా.. ఇదే ప‌రిస్థితి. కేవ‌లం కొత్త నెట్‌వ‌ర్క్‌లే కాదు. దేశంలో ద‌శాబ్దంపైగా సేవ‌లందిస్తున్న అన్న ప్ర‌ముఖ కంపెనీల సేవ‌లు ఇలాగే ఉన్నాయి. ముంబైలో ఏ ఆపరేటర్ కూడా ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందించడం లేదని, ఢిల్లీలో ఎయిర్ టెల్, ఎయిర్ సెల్, వోడాఫోన్ ఈ విషయంలో ఎంతో వెనుకబడ్డాయని ట్రాయ్ అసంతృప్తి వ్య‌క్తం చేసింద‌ని విశ్వ‌స‌నీయ‌ స‌మాచారం.
రూపాయి చెల్లించాల‌ని ట్రాయ్ ఆదేశం!
దీనిపై కొంత‌కాలంగా భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్ర‌తి కాల్ డ్రాప్‌కు రూపాయి చెల్లించాల‌ని ట్రాయ్ స్ప‌ష్టం చేసింది. రోజుకు మూడు కాల్స్ డ్రాప్స్ కు మించి పరిహారం ఇవ్వకూడదని ట్రాయ్ సూచించిందని, ఇది త్వరలోనే అమల్లోకి రానుందని స‌మాచారం. టెలికం ఆపరేటర్లు కచ్చితంగా దీనిని అమలుచేసేవిధంగా ట్రాయ్ ఓ రెగ్యులేషన్ ను జారీచేయనుంది. కాల్ డ్రాప్ చర్యలకు పాల్పడే టెలికం ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించిన సంగతి తెలిసిందే!
First Published:  16 Oct 2015 9:00 AM IST
Next Story