Telugu Global
National

దిగ్విజయ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు

కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ రిక్రూట్‌మెంట్ స్కాంలో ఇరుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగ్విజయ్ సేవలందించిన 1993- 2003 మధ్య కాలంలో రాష్ట్ర సచివాలయం, శాసనసభలో ఉద్యోగుల నియామకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నియామకాల్లో దిగ్విజయ్ సింగ్ అధికార దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు  దిగ్విజయ్‌ను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. దాదాపు 265 ప్రశ్నలు సంధించారు.  […]

దిగ్విజయ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు
X

కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ రిక్రూట్‌మెంట్ స్కాంలో ఇరుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగ్విజయ్ సేవలందించిన 1993- 2003 మధ్య కాలంలో రాష్ట్ర సచివాలయం, శాసనసభలో ఉద్యోగుల నియామకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నియామకాల్లో దిగ్విజయ్ సింగ్ అధికార దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దిగ్విజయ్‌ను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. దాదాపు 265 ప్రశ్నలు సంధించారు.

దిగ్విజయ్‌ను పోలీసులు విచారించిన పోలీస్ కంట్రోల్ రూమ్ వెలుపన దిగ్విజయ్ అనుచరులు, కాంగ్రెస్ నేతలు పెద్దెత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దిగ్విజయ్ వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోలో రికార్డు చేశారు. దిగ్విజయ్ సింగ్‌కు మరోసారి సమన్లు జారీ చేయడం లేదా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని పోలీసుల వర్గాల చెబుతున్నాయి. రాహుల్ కోటరీలో కీలక నేతగా ఉన్న దిగ్విజయ్ చిక్కుల్లో పడడంతో కాంగ్రెస్‌కు మింగుడుపడని అంశమే.

First Published:  16 Oct 2015 1:17 PM IST
Next Story