Telugu Global
National

బీహార్ రెండో విడతలో 56% పోలింగ్

బీహార్లో రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొదటి విడత మాదిరిగానే ఈసారి కూడా ఓటింగ్‌ శాతం దాదాపు అలాగే ఉంది. మొదటి విడతలో 57 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా ఈసారి 56% పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 6 జిల్లాల్లోని 32 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 23 నియోజకవర్గాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున […]

బీహార్ రెండో విడతలో 56% పోలింగ్
X

బీహార్లో రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొదటి విడత మాదిరిగానే ఈసారి కూడా ఓటింగ్‌ శాతం దాదాపు అలాగే ఉంది. మొదటి విడతలో 57 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా ఈసారి 56% పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 6 జిల్లాల్లోని 32 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 23 నియోజకవర్గాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున అంటే… లక్షకు పైగా భద్రతా సిబ్బంది పోలింగ్‌ బూత్‌ల వద్ద మోహరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. 32 మంది మహిళా అభ్యర్ధులతో సహా 456 మంది భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

First Published:  16 Oct 2015 7:56 AM GMT
Next Story