మురికివాడలకు ప్రభుత్వం 'గ్రేటర్' రాయితీ
వచ్చేనెల నుంచి 1475 మురికి వాడల్లో నివశించే పేదలకు నల్లా, కరెంట్ బిల్లుల చెల్లింపులో విశేష రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వినియోగంతో నిమిత్తం లేకుండా ఎంత వాడుకున్నా రూ. 300 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇది నల్లా బిల్లు, విద్యుత్ బిల్లులకు ప్రభుత్వం ఇచ్చే బొనాంజా. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ 1475 మురికివాడల్లో నివాసం ఉంటున్న సుమారు లక్షా 25వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్‌ఎస్ […]
BY admin15 Oct 2015 2:15 AM IST
X
admin Updated On: 15 Oct 2015 2:15 AM IST
వచ్చేనెల నుంచి 1475 మురికి వాడల్లో నివశించే పేదలకు నల్లా, కరెంట్ బిల్లుల చెల్లింపులో విశేష రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వినియోగంతో నిమిత్తం లేకుండా ఎంత వాడుకున్నా రూ. 300 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇది నల్లా బిల్లు, విద్యుత్ బిల్లులకు ప్రభుత్వం ఇచ్చే బొనాంజా. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ 1475 మురికివాడల్లో నివాసం ఉంటున్న సుమారు లక్షా 25వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో నెలకు 15 వేల లీటర్ల నీటి వినియోగం ఉండే ఇంటికి రూ. 212 బిల్లు వసూలు చేస్తున్నారు. అయితే ఇకపై గరిష్టంగా 150 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇక వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారికి నెలకు 300 రూపాయలు బిల్లు వస్తోంది. ఇకవై వీరికి నెలకు రూ. 150 బిల్లు మాత్రమే వస్తుంది. అంటే నల్లాకు, కరెంట్‌కు కలిపి గరిష్టంగా రూ. 300 మాత్రమే బిల్లు వస్తుందన్న మాట. అయితే ఇక్కడో మెలిక ఉంది. నోటిఫైడ్ మురికివాడలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంటే రెండు దశాబ్దాల కిందట నోటిఫై అయిన బస్తీలు మాత్రమే ఈ రాయితీ పథకాలు వర్తిస్తాయన్న మాట. నగరంలో నోటిఫై కాని మురికివాడలు మరో వెయ్యికి పైగానే ఉన్నాయి. వాటి సంగతి తాము చెప్పలేమని, ప్రభుత్వ త్వరలో జారీ చేసే ఉత్తర్వులతో వీటిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Next Story