గుణశేఖర్ పై నిఖిల్ ఫైర్
సర్కిల్ దాటి సాహాసాలు చేస్తున్నప్పుడు సరైన ప్లాన్ ఉండాలి. లేక పోతే సీన్ రివర్స్ అయిపోద్ది. తాజాగా గుణశేఖర్ రుద్రమ దేవి రిలీజ్ విషయం లో అదే జరుగుతుంది. ఈ మధ్య దాసరి నారాయణ రావు గారితో బ్రూస్ లీ చిత్రం రిలీజ్ కాస్తా వాయిదా వేస్తే బావుంటుందని చెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఇది సరైన ప్రణాళిక లేకండా చేసుకోవడం వల్లనే జరిగింది. దానికి బ్రూస్ లీ టీమ్ ను తప్పు పట్టడం సరికాదు అని […]
సర్కిల్ దాటి సాహాసాలు చేస్తున్నప్పుడు సరైన ప్లాన్ ఉండాలి. లేక పోతే సీన్ రివర్స్ అయిపోద్ది. తాజాగా గుణశేఖర్ రుద్రమ దేవి రిలీజ్ విషయం లో అదే జరుగుతుంది. ఈ మధ్య దాసరి నారాయణ రావు గారితో బ్రూస్ లీ చిత్రం రిలీజ్ కాస్తా వాయిదా వేస్తే బావుంటుందని చెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఇది సరైన ప్రణాళిక లేకండా చేసుకోవడం వల్లనే జరిగింది. దానికి బ్రూస్ లీ టీమ్ ను తప్పు పట్టడం సరికాదు అని బన్నీ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా యంగ్ హీరో నిఖిల్… అల్లు అర్జున్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. పరోక్షంగా గుణశేఖర్ తీరును తప్పుబట్టారు. రుద్రమదేవి సినిమా విడుదల తేదీ అనేక సార్లు మార్చారు. దాదాపు ఆరు నుండి ఏడు సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి సినిమా వాయిదా వేసారు. ఇలా చేయడం వల్ల ఎన్నో డేట్స్ వేస్ట్ అయ్యాయి. ప్రతి సారి ఓ డేట్ ప్రకటించడం, తర్వాత వాయిదా వేయడం చేసారు. గుణశేఖర్ చేసిన ఈ చర్యల వల్ల చాలా చిన్న సినిమాలు సఫర్ అయ్యాయి అని వ్యాఖ్యానించారు. రిలీజ్ విషయంలో సరైన ప్లానింగ్ లేని గుణశేఖర్ వల్లే ఇదంతా జరిగింది అని పలువురు మండి పడుతున్నారు.