గ్రేటర్ కాంగ్రెస్‌కు ఝలక్: కారెక్కిన ముద్దం
గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేత ముద్దం నరసింహా యాదవ్ పార్టీకి చేయిచ్చి కారెక్కారు. వచ్చేవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ వస్తున్న వేళ బలమున్న నేతలు ఇలా పార్టీలు మారితే ఏం సమాధానం చెప్పాలో తెలియక నేతలు, పీసీసీ చీఫ్ మదనపడుతున్నారట. ముద్దం నరసింహా బోయిన్‌పల్లికి చెందినవాడు. ఇతను రియల్టర్ స్థానికంగా బలమైన నేత. 2008లో ప్రజారాజ్యంలో చేరాడు. 2009లో ప్రజారాజ్యం తరఫున గ్రేటర్ కార్పొరేషన్‌కు […]
BY admin14 Oct 2015 6:05 PM GMT
X
admin Updated On: 14 Oct 2015 9:30 PM GMT
గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేత ముద్దం నరసింహా యాదవ్ పార్టీకి చేయిచ్చి కారెక్కారు. వచ్చేవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ వస్తున్న వేళ బలమున్న నేతలు ఇలా పార్టీలు మారితే ఏం సమాధానం చెప్పాలో తెలియక నేతలు, పీసీసీ చీఫ్ మదనపడుతున్నారట. ముద్దం నరసింహా బోయిన్‌పల్లికి చెందినవాడు. ఇతను రియల్టర్ స్థానికంగా బలమైన నేత. 2008లో ప్రజారాజ్యంలో చేరాడు. 2009లో ప్రజారాజ్యం తరఫున గ్రేటర్ కార్పొరేషన్‌కు ఎన్నికైన ఏకైక కార్పొరేటర్. కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్న ఈ స్థానంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి నెగ్గుకు వచ్చాడంటే.. అది పార్టీ చలవ కాదు, కేవలం స్థానికంగా ఇతనికి ఉన్న పేరు ప్రఖ్యాతలే! తరువాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడంతో తానూ చేరిపోయాడు.
కూకట్‌పల్లి నుంచి పోటీ!
2014 ఎన్నికలకు ముందు నుంచే.. కూకట్‌పల్లికి సీనియర్ కాంగ్రెస్ నేతల నుంచి తీవ్రంగా పోటీ ఉండేది. ఓ వైపు దివంగత వడ్డే పల్లి నర్సింగరావు, మరోవైపు హీరో శ్రీహరి ఈ స్థానంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవారు. దురదృష్ట వశాత్తూ ఏడాది తేడాలోనే.. ఈ ఇద్దరు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో కూకట్‌పల్లి వంటి పెద్ద నియోజకవర్గంలో పోటీ చేసేందుకు పార్టీ ముద్దంను రంగంలోకి దించింది. కానీ, కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించడంతో ముద్దం మూడోస్థానానికి పరిమితమయ్యాడు. తరువాత కాలంలోనూ కూకట్‌పల్లికి పెద్దదిక్కుగా ఉంటూ వచ్చిన ముద్దం ఒక్కసారిగా పార్టీ మారడం వెనక ఏంటి రహస్యమని చర్చించుకుంటున్నారు.
మేయర్ హామీ దక్కిందా?
త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేయర్ హామీ దక్కినందునే ముద్దం టీఆర్ ఎస్‌లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్‌కు మేయర్ అంటే..మంత్రి కంటే ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. పైగా రూ.3,500 కోట్ల వార్షిక బడ్జెట్. కొన్ని మంత్రిత్వ శాఖల బడ్జెట్ ఇందులో సగం కూడా ఉండదు. పైగా రాజధానిలో స్కైవేలు, మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, ఐటీ ఐఆర్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎన్నో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ స్థానం అంటే ఆషామాషీ కాదు. పైగా బీసీ కార్డు ఉండనే ఉంది. అందుకే ముద్దం నరసింహా ముందు జాగ్రత్తగా టీఆర్ ఎస్‌లో చేరారని చర్చ జరుగుతోంది.
Next Story