నో బ్యాగ్స్ డే...రీడింగ్ డేగా అబ్దుల్ కలాం బర్త్ డే!
ఇటీవల కన్నుమూసిన మన మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జయంతి నేడు. మహారాష్ట్ర విద్యార్థులు ఈ రోజుని నో బ్యాగ్స్ డేగా, రీడింగ్ డేగా జరుపుకుంటున్నారు. విద్యార్థులు స్కూలు బ్యాగులు లేకుండా స్కూళ్లకు వెళ్లి, పాఠ్యాంశాలు కాకుండా ఇతర వైజ్ఞానిక పుస్తకాలను చదివేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కలాం పుట్టిన రోజుని రీడింగ్ డేగా ప్రకటించింది. కలాం మరణించిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అలాగే ఈ రోజున పుస్తక […]
ఇటీవల కన్నుమూసిన మన మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జయంతి నేడు. మహారాష్ట్ర విద్యార్థులు ఈ రోజుని నో బ్యాగ్స్ డేగా, రీడింగ్ డేగా జరుపుకుంటున్నారు. విద్యార్థులు స్కూలు బ్యాగులు లేకుండా స్కూళ్లకు వెళ్లి, పాఠ్యాంశాలు కాకుండా ఇతర వైజ్ఞానిక పుస్తకాలను చదివేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కలాం పుట్టిన రోజుని రీడింగ్ డేగా ప్రకటించింది. కలాం మరణించిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అలాగే ఈ రోజున పుస్తక ప్రదర్శనా కార్యక్రమాలు నిర్వహించాలని, పుస్తకాలను బహుమతిగా ఇచ్చిపుచ్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఆ ప్రభుత్వం పాఠశాలలను కోరింది.
అబ్దుల్ కలాం 79వ పుట్టిన రోజు సందర్భంగా 2010లో ఐక్యరాజ్య సమితి ఆయన పుట్టిన రోజుని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించినట్టుగా భారత మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. అయితే ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ డేస్ లిస్టులో ఈ విషయం ఇప్పటివరకు ప్రకటితం కాలేదనే వాదనలు వినబడుతున్నాయి. నేడు గ్రామీణ మహిళల దినోత్సవంగా ఐక్యరాజ్యసమతి ఇంటర్నేషనల్ డేస్ లిస్ట్‌లో ఉండటం మనం గమనించవచ్చు. ఏదిఏమైనా నిరంతరం విద్యార్థులతో గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపేందుకు కృషి చేసిన అబ్దుల్ కలాం జయంతిని వరల్డ్ స్టూడెంట్ డేగా జరుపుకోవడం ఎంతో సముచితం. తనని ప్రజలు ఒక టీచరుగానే గుర్తుపెట్టుకోవాలని కలాం కోరుతుండేవారు.
పుదుచ్చేరి నుండి వెబ్ బేస్డ్ డిజిటల్ పుస్తకాలను రూపొందించే సంస్థ బుక్ బాక్స్, కలాం పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై రూపొందించిన యానిమేటెడ్ కథల పుస్తకాలను 22 భాషల్లో వెలువరించే పనిలో ఉంది. ఇప్పటికే ఇవి ఇంగ్లీషు, హిందీ, తమిళం, గుజరాతీ భాషల్లో లభ్యమవుతున్నాయి. యూ ట్యూబ్‌లో వీటిని 24 లక్షల మంది చూశారు. ఈ యానిమేషన్ కథనాలు 2011లో అబ్దుల్ కలాం ప్రోత్సాహంతోనే రూపుదిద్దుకున్నాయి. కలాం బాల్యం, ఆయన సైంటిస్టుగా, లీడరుగా సాగించిన జీవన ప్రయాణం నుండి ఐదు స్ఫూర్తి దాయకమైన సంఘటనలను ఈ యానిమేటెడ్ కథనాలకోసం ఎంపిక చేసుకున్నారు. రూపొందించిన భాషలోనే సబ్‌టైటిల్స్‌తో ఇవి ఇప్పటివరకు చాలా స్కూళ్లలో, టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యాయి.