Telugu Global
Others

ఇక టీవీ చూసినా ప‌న్ను క‌ట్టాల్సిందే!

 హైద‌రాబాద్‌లో సామాన్యుల‌కు చిక్కొచ్చి ప‌డింది. క‌రెంటు బిల్లు క‌ట్టినా, హోట‌ల్లో భోజ‌నం చేసినా..  ప‌న్నులు లేదా స‌ర్వీసు చార్జీల పేరిట ప్ర‌త్యేక రుసుం వ‌సూలు చేసే విధానం ఇక్క‌డ క‌చ్చితంగా అమ‌లవుతోంది. తాజ‌గా వాటి జాబితాలోకి టీవీ కూడా చేరిపోయింది… ఇదేం చోద్యం టీవీ చూసినా ప‌న్ను వేస్తారా? అంటూ ఎవ‌రు ఆశ్చ‌ర్య‌పోయినా.. ఇది న‌మ్మ‌లేని నిజం! ప్ర‌భుత్వం గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న కేబుల్ క‌నెక్ష‌న్ల‌పై వినోద‌పు ప‌న్ను వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌పై ప్ర‌తి ఇంటికి […]

ఇక టీవీ చూసినా ప‌న్ను క‌ట్టాల్సిందే!
X
హైద‌రాబాద్‌లో సామాన్యుల‌కు చిక్కొచ్చి ప‌డింది. క‌రెంటు బిల్లు క‌ట్టినా, హోట‌ల్లో భోజ‌నం చేసినా.. ప‌న్నులు లేదా స‌ర్వీసు చార్జీల పేరిట ప్ర‌త్యేక రుసుం వ‌సూలు చేసే విధానం ఇక్క‌డ క‌చ్చితంగా అమ‌లవుతోంది. తాజ‌గా వాటి జాబితాలోకి టీవీ కూడా చేరిపోయింది… ఇదేం చోద్యం టీవీ చూసినా ప‌న్ను వేస్తారా? అంటూ ఎవ‌రు ఆశ్చ‌ర్య‌పోయినా.. ఇది న‌మ్మ‌లేని నిజం! ప్ర‌భుత్వం గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న కేబుల్ క‌నెక్ష‌న్ల‌పై వినోద‌పు ప‌న్ను వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌పై ప్ర‌తి ఇంటికి రూ.5 చొప్పున వినోద‌పు ప‌న్ను పేరిట వ‌సూలు చేయాల‌ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నిర్ణ‌యించింది. త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ తొలుత గ్రేట‌ర్ వ‌ర‌కు ప‌రిమితం చేశారు. వాస్తవంగా జీహెచ్‌ఎంసీ కేబుల్ టీవీ కనెక్షన్ల చార్జీలపై 20 శాతం వినోద పన్ను వసూలు చేసి అందులో రెండు శాతాన్ని వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాల్సి ఉంది. ఆయితే జీహెచ్‌ఎంఎసీ అధికారులు కేబుల్ కనెక్షన్ల రాబడిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో వినోద పన్ను వసూళ్లు లేకుండాపోయాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 24 లక్షల కేబుల్ టీవీ కనెక్షన్లు, మరో 4 లక్షల వరకు డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఎమ్‌ఎస్‌ఓగా ఉన్న సిటీ కేబుల్, హాత్‌వే, డిజీ కేబుల్, ఆర్‌వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ సంస్థలు కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాయి. ప్ర‌తి వినియోగ‌దారుడి నుంచి ఇవి రూ.150-200 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నాయి. ఈ లెక్క‌న గ్రేటర్‌లోని వినియోగదారులపై నెలకు సుమారు రూ.1.20 కోట్ల అదనపు భారం పడనుంది.
First Published:  14 Oct 2015 6:38 AM IST
Next Story