Telugu Global
NEWS

బాబు రెండు జిల్లాలకే ముఖ్యమంత్రా ?

రాయలసీమలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా తయారవుతోంది. సీమ అభివృద్ధికి దూరంగా ఉండడం… రాజధాని నిర్మాణానికి కర్నూలును కాకుండా గుంటూరు జిల్లా అమరావతిని నిర్ణయించడం… అన్నిరకాలుగా వెనుకబడిన ప్రాంతం కావడంతో నాయకులంతా అసంతృప్తిగా ఉన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఓవైపు ముహూర్తం పెట్టగా దీనికి హాజరుకాకుండా నిరసన తెలపాలని నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బెంగళూరులో రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు సమావేశమయినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాయలసీమ వెనుకబాటు తనంతో ఉండటం […]

బాబు రెండు జిల్లాలకే ముఖ్యమంత్రా ?
X
రాయలసీమలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా తయారవుతోంది. సీమ అభివృద్ధికి దూరంగా ఉండడం… రాజధాని నిర్మాణానికి కర్నూలును కాకుండా గుంటూరు జిల్లా అమరావతిని నిర్ణయించడం… అన్నిరకాలుగా వెనుకబడిన ప్రాంతం కావడంతో నాయకులంతా అసంతృప్తిగా ఉన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఓవైపు ముహూర్తం పెట్టగా దీనికి హాజరుకాకుండా నిరసన తెలపాలని నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బెంగళూరులో రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు సమావేశమయినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాయలసీమ వెనుకబాటు తనంతో ఉండటం సరికాదని వీరంతా అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు 13 జిల్లాలకు ముఖ్యమంత్రిగా కాక కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని వీరు భావిస్తున్నారు.

ఇప్పటికే రాజధాని శంకుస్థాపనకు హాజరుకాకూడ‌దని నిర్ణయించిన కొందరు నేతలు తమ నిరసన తెలిపేందుకు శంకుస్థాపన సమయాన్ని ఎన్నుకున్నారు. ఓవైపు అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కర్నూలు రాజధానిగా ప్రకటించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అన్ని పార్టీల నేతలు కూడా ఇదే విషయమై హైదరాబాద్‌లో సమావేశమయినట్లు సమాచారం. టి.జి. వెంకటేష్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ఏంవీ మైసూరారెడ్డి తదితర సీనియర్లు, రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నట్టు చెబుతున్నారు. వీరితోపాటు అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసింది. ప్రత్యేకహోదా విషయం పక్కన పెట్టిన టీడీపీ నాయకులు కనీసం రాయలసీమ ప్యాకేజీ, ఉత్తరాంధ్ర ప్యాకేజీల గురించి కూడా సరైన ప్రతిపాదనలు చేయడం లేదన్న అసంతృప్తి వీరిలో గూడుకట్టుకుని ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఉద్యమ రూపంలోకి తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  14 Oct 2015 4:09 PM IST
Next Story