Telugu Global
Others

సీమ నేతల సీక్రెట్ భేటీ ఎందుకు?

రాయలసీమ నేతలు బెంగళూరులో రహస్యంగా సమావేశం అయినట్టు సమాచారం. ఇప్పుడీ అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సీమ నేతలు రహస్యంగా సమావేశం కావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది… ఈ పరిణామం ఎటు దారి తీస్తుందన్న దానిపై అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం రాయలసీమపై వివక్ష చూపుతోందని సీమ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీమ హక్కుల కోసం ఎలా పోరాటం చేయాలన్న దానిపై చర్చించేందుకు సీమకు చెందిన వివిధ పార్టీల సీనియర్ నేతలు, మేధావులు బెంగళూరు […]

సీమ నేతల సీక్రెట్ భేటీ ఎందుకు?
X

రాయలసీమ నేతలు బెంగళూరులో రహస్యంగా సమావేశం అయినట్టు సమాచారం. ఇప్పుడీ అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సీమ నేతలు రహస్యంగా సమావేశం కావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది… ఈ పరిణామం ఎటు దారి తీస్తుందన్న దానిపై అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం రాయలసీమపై వివక్ష చూపుతోందని సీమ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీమ హక్కుల కోసం ఎలా పోరాటం చేయాలన్న దానిపై చర్చించేందుకు సీమకు చెందిన వివిధ పార్టీల సీనియర్ నేతలు, మేధావులు బెంగళూరు భేటీకి హాజరైనట్టు తెలుస్తోంది.

కేవలం రాజధాని ప్రాంతంపై మినహా రాయలసీమ గురించి చంద్రబాబు ఒక్కశాతం కూడా ఆలోచించడం లేదని సీమ నేతలు మండిపడుతున్నారు. రాయలసీమ విద్యార్థులకు తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ సీట్లు దక్కకుండా 120 జీవో తేవడం… హైకోర్టు మెట్టికాయలు వేసినా కక్షసాధింపుగా సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెల్లడం సీమ నేతలకు ఆగ్రహం తెప్పించింది. సీమ పేరు వాడుకుని పట్టిసీమ నిర్మించడం… రాయలసీమకు నీరందించే హంద్రీనీవా గురించి మాత్రం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. పట్టిసీమ పేరుతో రాయలసీమ వాళ్లను పిచ్చివాళ్లను చేశారని రగిలిపోతున్నారు.

ఎంతసేపు రాజధాని గురంచి మాట్లాడే చంద్రబాబు రాయలసీమకు దక్కాల్సిన ప్రత్యేక ప్యాకేజ్‌పై ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన సీమ నేతలు ఆంధ్రప్రదేశ్ తమకు న్యాయంజరిగే పరిస్థితి కనిపించడం లేదని భావిస్తున్నారు.

సీమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం అస్నమైందని కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. సీమ జనం మౌనంగా ఉంటే చంద్రబాబు మరింత అన్యాయం చేస్తారని డీఎల్ హెచ్చరించారు.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా సీమ హక్కులపై గళమెత్తుతూనే ఉన్నారు. ఆయన ఇటీవల సీమ జలాల కోసం ఢిల్లీలో ధర్నా కూడా చేశారు.

మైసూరారెడ్డి, టీజీ వెంకటేశ్ లాంటి వారు కూడా సీమకు జరుగుతున్న అన్యాయంపై పదేపదే నిలదీస్తూనే ఉన్నారు. మొత్తానికి సాధారణంగా కాకుండా పనిగట్టుకుని బెంగళూరులో సీమ నేతలు రహస్యంగా సమావేశం అవడాన్ని తేలిగ్గా తీసుకోలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పాలనలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమపై కక్ష కట్టారన్న అభిప్రాయం మరింత బలపడకముందే జాగ్రత్త పడాలని కోరుతున్నారు. లేకుంటే ఏపీ కూడా మళ్లీ ముక్కలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

First Published:  14 Oct 2015 2:22 PM IST
Next Story