ఆన్‌లైన్ పండగ.. ఆఫ్‌లైన్ దండగా!
ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజాలు దసరా, దీపావళి పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి ఎలాగోలా వస్తువులను కొనిపించే కార్యక్రమానికి తెరలేపాయి. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ దిగ్గజాలు భారీ అమ్మకాలకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పుడు నగరంలో ఎవరిని కదిలించినా ఇదే చర్చ! ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ఉద్యోగులు వీలు కల్పించుకుని మరీ ఏ వస్తువులు ఎంతకు అమ్ముతున్నారోనని క్షణ క్షణం తనిఖీ చేసుకుంటున్నారు. చెప్పులు, దుస్తులు, కిచెన్‌వేర్, స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని రకాల వస్తువుల […]
BY admin14 Oct 2015 6:38 AM IST
X
admin Updated On: 14 Oct 2015 6:38 AM IST
ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజాలు దసరా, దీపావళి పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి ఎలాగోలా వస్తువులను కొనిపించే కార్యక్రమానికి తెరలేపాయి. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ దిగ్గజాలు భారీ అమ్మకాలకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పుడు నగరంలో ఎవరిని కదిలించినా ఇదే చర్చ! ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ఉద్యోగులు వీలు కల్పించుకుని మరీ ఏ వస్తువులు ఎంతకు అమ్ముతున్నారోనని క్షణ క్షణం తనిఖీ చేసుకుంటున్నారు. చెప్పులు, దుస్తులు, కిచెన్‌వేర్, స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని రకాల వస్తువుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రిటైల్‌స్టోర్లు వెలవెల!
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఏదో రూపంలో ఆన్‌లైన్ దిగ్గజాలు తమ ఆఫర్ గురించి ప్రచారం చేసుకుంటున్నాయి. వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు, స్మార్ట్‌ఫోన్ మెసేజ్‌లు, ఈ-మెయిల్, ఫేస్‌బుక్ ఇలా దేన్నీ వదలడం లేదు. దీంతో ఆఫ్‌లైన్ వ్యాపారాలకు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. టైం వేస్ట్ కాదు, బోలెడంత సమయం ఆదా, పైగా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. అందుకే, స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి వ్యక్తి ఆన్‌లైన్ కొనుగోలుకే మొగ్గు చూపుతున్నాడు. వీటికి తోడు బిగ్ బాస్కెట్ వంటి ఆన్‌లైన్ సంస్థలు రిటైల్ రంగంలోకి కూడా ప్రవేశించడంతో చిల్లర వ్యాపారాలపైనా తీవ్రమైన దెబ్బపడుతోంది.
వీటికి కళ్లెం వేయలేరా?
భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతోనే ఆన్‌లైన్ వ్యాపారంవైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీరు ఒక్కరోజులోనే రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. దీనిపై రిటైల్, చిల్లర వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆన్‌లైన్ సంస్థల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని టపాసుల తయారీ కేంద్రంగా దేశంలోనే పేరొందిన శివకాశీ వ్యాపారులు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మొరపెట్టుకున్నారు. వీటికి కళ్లెం వేయకపోతే.. తమ పొట్ట కూటికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి వినతిని ఆమె స్వీకరించినప్పటికీ తరువాత కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ సంస్థలు వస్తువులు తయారీ, ప్యాకింగ్ చేసే రాష్ర్టాలలో మాత్రమే పన్ను కడుతున్నాయి. వీటికి అదనపు ట్యాక్స్‌లు ఉండకపోవడం గమనార్హం. అందుకే వినియోగదారులకు తక్కువ ధరకు ఇస్తున్నాయి. ఈ పరిణామం కారణంగా దేశంలోని మిగిలిన రాష్ర్టాలు తమకు రావాల్సిన కోట్లాది రూపాయల పన్నులను నష్టపోతున్నాయి.
Next Story