జగన్ డిశ్చార్జ్‌కి డాక్టర్లు గ్రీన్ సిగ్నల్
ప్రత్యేక హోదా కోరుతూ ఏడు రోజులపాటు నిరవధిక నిరాహారదీక్ష చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ఏడో రోజు ఆయన దీక్ష భగ్నం చేసి ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకున్నారు. ఈ మేరకు వైద్యులు ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో జగన్ నిరవధిక దీక్ష చేయగా ఆరు రోజుల తర్వాత ఏడో రోజున ఆయనను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత […]
BY sarvi14 Oct 2015 1:05 AM IST
X
sarvi Updated On: 14 Oct 2015 3:51 PM IST
ప్రత్యేక హోదా కోరుతూ ఏడు రోజులపాటు నిరవధిక నిరాహారదీక్ష చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ఏడో రోజు ఆయన దీక్ష భగ్నం చేసి ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకున్నారు. ఈ మేరకు వైద్యులు ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో జగన్ నిరవధిక దీక్ష చేయగా ఆరు రోజుల తర్వాత ఏడో రోజున ఆయనను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 24 గంటల పాటు తమ పర్యవేక్షణలో జగన్‌కు ట్రీట్ మెంట్ అవసరమని వైద్యులు తెలిపారు. ప్లూయిడ్స్ ఎక్కించి ఆయన తిరిగి కోలుకోవడానికి వారు చికిత్స అందించారు. మొదట్లో ప్లూయిడ్స్ తీసుకోడానికి నిరాకరించిన జగన్ ఆతర్వాత డాక్టర్ల సూచన మేరకు అంగీకరించారు. దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పుడు జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన డిశ్చార్జ్ కావచ్చని వైద్యులు తెలిపారు. ఈ సాయంత్రం జగన్ ఆస్పత్రి నుంచి బయటకు రావచ్చని భావిస్తున్నారు.
Next Story