చంద్రబాబు అపచారం చేశారా?
రాజధాని కోసం నిర్వహిస్తున్న మన మట్టి- మన నీరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంతూరు నారావారిపల్లెలో పుట్టమట్టిని సేకరించారు. ఈ సందర్భంగా పుట్టవద్ద నాగపూజలు నిర్వహించారు. అయితే చంద్రబాబు ఇలా పూజల్లో పాల్గొనడంపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీవ్ర అపచారానికి పాల్పడ్డారంటూ అందుకు కారణాన్ని కూడా వివరించారు. ఐదురోజుల క్రితం చంద్రబాబు పెదనాన్న కుమారుడు మరణించారు. దీంతో కర్మక్రియలు పూర్తయ్యే వరకు చంద్రబాబు కూడా శుభకార్యాల్లో పాల్గొనకూడదని చెవిరెడ్డి […]

రాజధాని కోసం నిర్వహిస్తున్న మన మట్టి- మన నీరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంతూరు నారావారిపల్లెలో పుట్టమట్టిని సేకరించారు. ఈ సందర్భంగా పుట్టవద్ద నాగపూజలు నిర్వహించారు. అయితే చంద్రబాబు ఇలా పూజల్లో పాల్గొనడంపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీవ్ర అపచారానికి పాల్పడ్డారంటూ అందుకు కారణాన్ని కూడా వివరించారు.
ఐదురోజుల క్రితం చంద్రబాబు పెదనాన్న కుమారుడు మరణించారు. దీంతో కర్మక్రియలు పూర్తయ్యే వరకు చంద్రబాబు కూడా శుభకార్యాల్లో పాల్గొనకూడదని చెవిరెడ్డి చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని అందుకే మనవడి కేశఖండన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారని వివరించారు.కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటున్న చంద్రబాబు రాజధాని పూజ కార్యక్రమాల్లో మాత్రం ఎలా పాల్గొంటారని విమర్శించారు. చంద్రబాబు నాగపూజలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. స్వామీజీలు ఈ విషయంపై చంద్రబాబును నిలదీయాలని కోరారు.