14 నుంచి 21 వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆందోళన బాట
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నిరాహారదీక్ష విరమించినంత మాత్రాన ప్రత్యేక హోదా విషయంలో పోరాటానికి ఫుల్‌స్టాప్ పెట్టకూడదని ఆ పార్టీ నిర్ణయించింది. హోదా సాధించేవరకు పోరాటం కొనసాగించాలని, వివిధ రూపాల్లో దీన్ని బతికించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. పార్టీ ముఖ్యనేతల సమావేశంలో కార్యాచరణను నిర్ణయించారు. దీని ప్రకారం బుధవారం నుంచి ఈ […]
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నిరాహారదీక్ష విరమించినంత మాత్రాన ప్రత్యేక హోదా విషయంలో పోరాటానికి ఫుల్‌స్టాప్ పెట్టకూడదని ఆ పార్టీ నిర్ణయించింది. హోదా సాధించేవరకు పోరాటం కొనసాగించాలని, వివిధ రూపాల్లో దీన్ని బతికించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. పార్టీ ముఖ్యనేతల సమావేశంలో కార్యాచరణను నిర్ణయించారు. దీని ప్రకారం బుధవారం నుంచి ఈ నెల ఇరవై ఒకటోతేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు తలపెట్టారు. ఇందులో భాగంగా బుధవారం నాడు పిడబ్ల్యుడి మైదానం నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. 18న నియోజకవర్గ ర్యాలీలు, 19న ధర్నాలు, 20న కొవ్వొత్తుల ప్రదర్శన, 21న బస్ డిపోల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు రాంబాబు తెలిపారు. మొత్తం మీద ఉద్యమాన్ని వారం రోజులపాటు కొనసాగించి తర్వాత మళ్ళీ ప్రణాళిక సిద్ధం చేయాలని భావిస్తున్నట్టు రాంబాబు తెలిపారు. దసరా వరకు ‘మన మట్టి…మన నీరు’ పేరుతో రోజూ ప్రభుత్వం కార్యక్రమాలు తలపెట్టింది. దానికి పోటీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా ఆందోళనలు చేపట్టడానికి నిర్ణయించడం చర్చనీయాంశమయ్యింది.