Telugu Global
National

బీజేపీ-శివసేన కటీఫ్?

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న సామెత మహారాష్ట్రలో మరోసారి నిరూపితం అవుతోంది. మరాఠా గడ్డపై మరోసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ-శివసేన సర్కార్ మధ్య రచయిత సుదీంద్ర కులకర్ణి వివాదం కొత్త చిచ్చు రగిల్చింది. సోమవారం సుధీంద్ర కులకర్ణిపై శివసేన నల్లరంగు పెయింట్ తో దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. దీంతో శివసేన పార్టీ కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చింది. నవంబర్ 1న జరిగే కల్యాణ్ డోంబీవాలీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ […]

బీజేపీ-శివసేన కటీఫ్?
X

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న సామెత మహారాష్ట్రలో మరోసారి నిరూపితం అవుతోంది. మరాఠా గడ్డపై మరోసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ-శివసేన సర్కార్ మధ్య రచయిత సుదీంద్ర కులకర్ణి వివాదం కొత్త చిచ్చు రగిల్చింది. సోమవారం సుధీంద్ర కులకర్ణిపై శివసేన నల్లరంగు పెయింట్ తో దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. దీంతో శివసేన పార్టీ కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చింది.
నవంబర్ 1న జరిగే కల్యాణ్ డోంబీవాలీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన ఇదివరకే నిర్ణయించింది. ఇప్పుడు ఏకంగా122 వార్డులకూ నామినేషన్లు వేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది. దీంతో కమలనాథులు కూడా ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారు. ఒంటరి పోరులో శివసేన విజయం సాధిస్తే, రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది.
నిజానికి మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బాల్ థాకరే మృతి తర్వాత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సీట్ల పంపకాల్లో తేడాలు వచ్చాయి. శివసేన, బీజేపీ ఒంటరిగా పోటీ చేశాయి. శివసేన ఘోరంగా దెబ్బతినగా మోడీ హవాతో బీజేపీ122 సీట్లు సాధించి శివసేనకు షాకిచ్చింది. శివసేన 63 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు శివసేన కూటమి నుంచి బయటకు వెళ్లిపోయినా ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదన్న భావనలో బీజేపీ ఉంది. ఎన్సీపీ సహా ఇతర పార్టీలు బయటి నుంచి మద్దతివ్వడానికి రెడీగా ఉంటాయని కమలనాథులు ధీమాగా ఉన్నారు.

First Published:  13 Oct 2015 8:43 AM GMT
Next Story