Telugu Global
CRIME

ఆరువేల కోట్ల 'బరోడా' స్కాంలో ఆరుగురు అరెస్ట్‌

బరోడా బ్యాంకులోని 59 ఖాతాల ద్వారా హాంకాంగ్, దుబాయ్లోని బూటకపు ఎగుమతి-దిగుమతి కంపెనీలకు నిధులు బదిలీ చేయడం ద్వారా ఆరువేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఇందులో నలుగురిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేయగా మరో ఇద్దరిని సిబీఐ అరెస్ట్‌ చేసింది. అరెస్టయిన వారిలో ఢిల్లీలోని అశోక్ విహార్ బ్రాంచ్కు చెందిన బ్రాంచ్ హెడ్ సురేశ్కుమార్ గార్గ్, ఫారెన్ ఎక్స్చేంజ్ హెడ్ జైనిస్ దూబే ఉన్నారు. బ్యాంకు అధికారులే ఈ స్కాంకు పాల్పడినట్టు […]

బరోడా బ్యాంకులోని 59 ఖాతాల ద్వారా హాంకాంగ్, దుబాయ్లోని బూటకపు ఎగుమతి-దిగుమతి కంపెనీలకు నిధులు బదిలీ చేయడం ద్వారా ఆరువేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఇందులో నలుగురిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేయగా మరో ఇద్దరిని సిబీఐ అరెస్ట్‌ చేసింది. అరెస్టయిన వారిలో ఢిల్లీలోని అశోక్ విహార్ బ్రాంచ్కు చెందిన బ్రాంచ్ హెడ్ సురేశ్కుమార్ గార్గ్, ఫారెన్ ఎక్స్చేంజ్ హెడ్ జైనిస్ దూబే ఉన్నారు. బ్యాంకు అధికారులే ఈ స్కాంకు పాల్పడినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా ఈ స్కాంను ఛేదించడానికి సీబీఐ-ఈడీ సంయుక్తంగా విచారణ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ అరెస్ట్‌లు జరిగాయి. బ్యాంకు అధికారులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఈ మనీ లాండరింగ్ కుంభకోణాన్ని నడిపించినట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.

First Published:  12 Oct 2015 9:31 PM IST
Next Story