కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టుకు కోదండరామ్
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై టీ-పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రత్యక్ష పోరాటానికి దిగారు. మొన్నటి వరకు రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న ఆయన ఇపుడు నేరుగా కోర్టుకెక్కారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై మంగళవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆత్మహత్యలను ప్రొత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, స్వామినాథన్ కమిటీ నివేదికను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తన ఆ పిటిషన్‌లో ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం […]
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై టీ-పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రత్యక్ష పోరాటానికి దిగారు. మొన్నటి వరకు రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న ఆయన ఇపుడు నేరుగా కోర్టుకెక్కారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై మంగళవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆత్మహత్యలను ప్రొత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, స్వామినాథన్ కమిటీ నివేదికను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తన ఆ పిటిషన్‌లో ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పెద్దగా పెట్టించుకోవడం లేదని, దీనివల్ల ఇవి పెరుగుతున్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరుపున కోదండరాం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా… ఇదే అంశంపై వారం రోజుల క్రితమే వ్యవసాయ జనచైతన్య వేదిక కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించిన కోదండరామ్‌ను ప్రభుత్వం పట్టించుకోక పోవడమే కాకుండా నిర్లక్ష్యం చేయడం… ఆయన మాటకు అసలు విలువ ఇవ్వకుండా పోవడంతో ఇక నేరుగా ప్రజాస్వామ్య వేదికల మీదే తాడో పేడో తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కొంతకాలంగా ఎలాంటి ప్రకటనలు చేయని కోదండరామ్ ఇప్పుడు ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేయడంతోనే మరోసారి ప్రజల్లోకి వస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కృతుడైన యోగేంద్ర యాదవ్ తో కలిసి మెదక్ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలపై ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది ఆసక్తి కరంగా మారింది.