జగన్ దీక్ష భగ్నం
ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణించిందన్న వైద్యుల సూచన మేరకు పోలీసులు.. ఆయన్ను జీజీహెచ్‌కు తరలించారు. జగన్‌ను తరలిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆరు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నారు. ఏఎస్పీ భాస్కర్‌రావుతో పాటు.. పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకొని తెల్లవారుజాము 4. 15 నిమిషాల సమయంలో జగన్‌ను ఆస్పత్రికి తరలించారు. స్ట్రెచర్పై తీసుకెళ్లి 108 అంబులెన్స్లో […]

ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణించిందన్న వైద్యుల సూచన మేరకు పోలీసులు.. ఆయన్ను జీజీహెచ్‌కు తరలించారు. జగన్‌ను తరలిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆరు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నారు.
ఏఎస్పీ భాస్కర్‌రావుతో పాటు.. పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకొని తెల్లవారుజాము 4. 15 నిమిషాల సమయంలో జగన్‌ను ఆస్పత్రికి తరలించారు. స్ట్రెచర్పై తీసుకెళ్లి 108 అంబులెన్స్లో ఎక్కించారు. ఈ సమయంలో పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. జగన్‌ను తరలించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జి చేశారు.
ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వైద్యులు చెప్పారని అందుకే ఆస్పత్రికి తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. , జీజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగంలో జగన్‌కు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ..జగన్‌కు ప్లూయిడ్స్ ఎక్కించారు. జగన్ తల్లి విజయమ్మ, ఆయన సతీమణి భారతి, సోదరి షర్మిల గుంటూరు ఆస్పత్రికి చేరుకున్నారు.