Telugu Global
NEWS

ఏపీలో నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ వాడకం తప్పనిసరి చేయాలని, దీన్ని ఏ వాహనదారుడు నిర్లక్ష్యం చేసినా జరిమానా విధించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు రవాణా శాఖ కమిషనర్‌ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. గుంటూరులోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన తనిఖీలు చేస్తూ హెల్ప్‌ డెస్క్‌ను, కార్యాలయంలో ఇతర వసతులను, అధికారుల పనితీరును పరిశీలించారు. నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని లేకుంటే జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు.  ‘హెల్మెట్‌ దరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి’ […]

ఏపీలో నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి
X
ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ వాడకం తప్పనిసరి చేయాలని, దీన్ని ఏ వాహనదారుడు నిర్లక్ష్యం చేసినా జరిమానా విధించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు రవాణా శాఖ కమిషనర్‌ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. గుంటూరులోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన తనిఖీలు చేస్తూ హెల్ప్‌ డెస్క్‌ను, కార్యాలయంలో ఇతర వసతులను, అధికారుల పనితీరును పరిశీలించారు. నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని లేకుంటే జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ‘హెల్మెట్‌ దరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి’ అన్న నినాదాలతో రూపొందించిన ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. అధికారుల్లో కూడా జవాబుదారీతనం పెంచడానికి వాహన తనిఖీ అధికారులకు త్వరలోనే టాబ్లెట్స్‌, కెమెరాలు అందించనున్నట్లు తెలిపారు. తనిఖీ సమయంలో ఆ వాహనానికి అధికారులు గతంలో ఎన్నిసార్లు జరిమానాలు విధించారు, వాహనం కండిషన్‌, ట్యాక్స్‌ పెండింగ్‌, ఇన్సూరెన్స్‌ ఉందీ లేనిదీ తదితర విషయాలు టాబ్లెట్ల ద్వారా అధికారులు తెలుసుకోవచ్చన్నారు. ఇక కెమెరాల వల్ల వాహనాన్ని అధికారి ఏ పరిస్థితుల్లో నిలిపి తనిఖీ చేశారు, ఆ సమయంలో డ్రైవర్‌ స్థితిగతులు, వారి మధ్య సంభాషణలు రికార్డు చేసే అవకాశం ఉంటుందన్నారు. రవాణాశాఖలో దళారీ వ్యవస్థను కూడా రూపు మాపేందుకు, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.​
First Published:  13 Oct 2015 3:27 AM IST
Next Story