Telugu Global
NEWS

అసెంబ్లీ... ఛలో తుళ్లూరు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ఇకపై ఏపీలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం రాజధానికి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలోనే తాత్కాలిక నిర్మాణాలు చేయనున్నారు. తాత్కాలిక ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమావేశం నిర్వహించారు. ఐదెకరాల విస్తీర్ణంలో ఫైబర్ బీమ్స్ సాయంతో అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్‌లో జరిగే సమావేశాల నాటికి తుళ్లూరులో యుద్ధప్రాతిపదికన అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. వెంటనే టెండర్లు పిలవాలని […]

అసెంబ్లీ... ఛలో తుళ్లూరు
X

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ఇకపై ఏపీలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం రాజధానికి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలోనే తాత్కాలిక నిర్మాణాలు చేయనున్నారు. తాత్కాలిక ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమావేశం నిర్వహించారు.

ఐదెకరాల విస్తీర్ణంలో ఫైబర్ బీమ్స్ సాయంతో అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్‌లో జరిగే సమావేశాల నాటికి తుళ్లూరులో యుద్ధప్రాతిపదికన అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. అయితే అసెంబ్లీ నిర్మాణంలో ఎక్కడా నిధుల దుర్వినియోగానికి అవకాశం ఇవ్వకూడదని స్పీకర్ హెచ్చరించారు. ప్రస్తుతం శంకుస్థాపన కోసం భూములను చదును చేస్తుండడంతో అక్కడ అసెంబ్లీ తాత్కాలిక నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.

First Published:  13 Oct 2015 9:07 AM GMT
Next Story