పవన్ ఫ్యాన్స్‌కు వెట"కారం" పూసిన వర్మ
ఎదుటి వాళ్లను గెలకడం అనే హాబీతో హ్యాపీగా బతికేస్తున్న వర్మ… ఇప్పుడు పవర్ స్టార్ మీద పడ్డాడు. దేవుడా ఇతడితో ఎందుకు పెట్టుకున్నామా… అని పవన్ ఫ్యాన్స్ పరేషాన్ అయ్యేలా వెంటపడుతున్నాడు. ఇటీవల పవన్ ఫ్యాన్స్ నాలెడ్జ్ లేని వికలాంగులు, ఇంగ్లీష్ రాని అభిమానులు అంటూ ట్విట్టర్‌లో ఘోరంగా అవమానించిన వర్మ ”వరల్డ్ పవనిజం డే” నాడు కూడా ఫ్యాన్స్‌ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ”వరల్డ్ పవనిజం డే” శుభాకాంక్షలంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. ”వరల్డ్ పవనిజం డే […]
ఎదుటి వాళ్లను గెలకడం అనే హాబీతో హ్యాపీగా బతికేస్తున్న వర్మ… ఇప్పుడు పవర్ స్టార్ మీద పడ్డాడు. దేవుడా ఇతడితో ఎందుకు పెట్టుకున్నామా… అని పవన్ ఫ్యాన్స్ పరేషాన్ అయ్యేలా వెంటపడుతున్నాడు. ఇటీవల పవన్ ఫ్యాన్స్ నాలెడ్జ్ లేని వికలాంగులు, ఇంగ్లీష్ రాని అభిమానులు అంటూ ట్విట్టర్‌లో ఘోరంగా అవమానించిన వర్మ ”వరల్డ్ పవనిజం డే” నాడు కూడా ఫ్యాన్స్‌ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు.
”వరల్డ్ పవనిజం డే” శుభాకాంక్షలంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. ”వరల్డ్ పవనిజం డే సందర్భంగా శుభాకాంక్షలు… ఎందుకంటే అతడు ప్రపంచానికి మొత్తం తెలుసు. చివరకు అర్జెంటీనా, ఐస్ ల్యాండ్, ఆఫ్రికాలోనూ ఆయన చాలా ఫేమస్” అంటూ సెటైర్ వేశారు. ప్రపంచ పవనిజం డే సందర్భంగా తాను మనస్పూర్తిగా మరో విషయం కూడా నమ్ముతున్నానని వర్మ చెప్పారు. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ బాహుబలిని మించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుందని ట్వీట్‌లో వెటకారానికి కారం పూసి పవన్ ఫ్యాన్స్‌కు అంటించారు వర్మ.
కొంతకాలంగా పవన్ ఫ్యాన్స్ ,వర్మ మధ్య ట్వీట్టర్ వార్ నడుస్తోంది. వర్మను ట్వీట్టర్‌లో చంపేసిన పవన్ ఫ్యాన్స్ అతడి ఫోటోకు పూలదండ వేశారు. సినీ పరిశ్రమకు పీడ వదిలిందంటూ నివాళులర్పించారు. అంతే రేంజ్‌లో వర్మ కూడా స్పందించారు. పవన్ ఫ్యాన్స్ చదువురాని, టెక్నికల్ నాలెడ్జ్ లేని వికలాంగులంటూ వారిని సంబోధించాడు. రైతుల గురించి పవన్ పోరాడే బదులు ఫ్యాన్స్‌ని ఎడ్యుకేట్ చేయొచ్చు కదా అంటూ వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ లు పెట్టారు. అంతటితో ఆగలేదు. మహేష్ ఫ్యాన్స్‌తో పోల్చి పవన్ ఫ్యాన్స్‌కు మండేలా చేశారు. తాను ఇంగ్లీష్ లో పెట్టిన ట్వీట్ పవన్ అభిమానులకు అర్థం కాదని… మహేష్ ఫ్యాన్స్ ఆ అర్థాన్ని తెలుగులో వారికి చెప్పండంటూ కామెంట్ పోస్ట్ చేశాడు.