రైతు కుటుంబాలకు నెలనెలా రూ.2500 సాయం!
రైతు ఆత్మహత్యల కారణంగా కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ జాగృతి సమితి అండగా ఉంటుందని సంస్థ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు ప్రతినెలా రూ.2500 చొప్పున నాలుగేళ్లపాటు ఆర్థిక సాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కొంతకాలంగా తెలంగాణ జాగృతి ప్రయత్నాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం […]
BY sarvi12 Oct 2015 3:30 AM IST
X
sarvi Updated On: 12 Oct 2015 3:30 AM IST
రైతు ఆత్మహత్యల కారణంగా కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ జాగృతి సమితి అండగా ఉంటుందని సంస్థ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు ప్రతినెలా రూ.2500 చొప్పున నాలుగేళ్లపాటు ఆర్థిక సాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కొంతకాలంగా తెలంగాణ జాగృతి ప్రయత్నాలు ప్రారంభించిందని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా కేసులు నమోదయ్యాయని ఎంపీ కవిత పేర్కొన్నారు. అయితే త్రిసభ్య కమిటీ వీటిలో 397 కేసులను రైతు ఆత్మహత్యలుగా నిర్ధారించిందన్నారు. సహజంగానే ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలుంటాయని, వాటిని ఉల్లంఘించకుండానే ఈ నిర్ధారణ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. త్రిసభ్య కమిటీ సూచించిన విధంగా 397 మంది కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందుతుందన్నారు. మిగిలిన 389 మందిని ఆదుకోవాలన్నది తమ లక్ష్యమని కవిత ప్రకటించారు. అందుకే వీరందరికీ తెలంగాణ జాగృతి తరఫున నెలనెలా రూ.2500 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు వివరించారు. కేవలం ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా.. వారి కుటుంబాలకు మానసికంగా ధైర్యం కల్పించేందుకు అనుక్షణం వారి వెంట ఉంటామని తెలిపారు.
Next Story