మంత్రి ప్రత్తిపాటి మెడకు అగ్రిగోల్డ్ స్కాం !
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణం మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు మెడకు చుట్టుకుంటోంది. స్కాం బయటపడిన తర్వాత తక్కువ ధరకు అగ్రిగోల్డ్ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు భూములు కొనుగోలు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి తన భార్య పేరుతో తక్కువ ధరకు అగ్రిగోల్డ్ భూములు కొన్నారని వైసీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, మర్రిరాజశేఖర్, జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో మంత్రి కుమ్మకయ్యారని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రత్తిపాటి భూముల కొనుగులుపై సీఐడీ విచారణ జరిపించాలని వారు డిమాండ్ […]

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణం మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు మెడకు చుట్టుకుంటోంది. స్కాం బయటపడిన తర్వాత తక్కువ ధరకు అగ్రిగోల్డ్ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు భూములు కొనుగోలు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి తన భార్య పేరుతో తక్కువ ధరకు అగ్రిగోల్డ్ భూములు కొన్నారని వైసీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, మర్రిరాజశేఖర్, జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో మంత్రి కుమ్మకయ్యారని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రత్తిపాటి భూముల కొనుగులుపై సీఐడీ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే భూముల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లు తామే బయటపెడుతామని వైసీపీ నేతలు హెచ్చరించారు. వెంటనే ప్రత్తిపాటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.