Telugu Global
Others

అప్పట్లో బాబు షుగర్ లెవల్స్ ఎలా మారాయి ?

జగన్‌ నిరవధిక దీక్షపై మంత్రులు కామినేని, ప్రత్తిపాటి ఆరోపణల నేపథ్యంలో నేతలు గతాన్ని గుర్తు చేస్తున్నారు. 2010 డిసెంబర్‌లో రైతు సమస్యలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నిరవధిక దీక్ష చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష చేశారు. మూడు రోజుల పాటు దీక్ష చేసిన అనంతరం ఆయన పూర్తిగా నిరసించిపోయారు. దీక్ష భగ్నానికి ముందు వైద్యులు దీక్ష శిబిరం వద్ద పరీక్షలు నిర్వహించగా షుగర్ లెవల్స్ 80 గా ఉన్నట్టు తేలింది. దీక్షను […]

అప్పట్లో బాబు షుగర్ లెవల్స్ ఎలా మారాయి ?
X

జగన్‌ నిరవధిక దీక్షపై మంత్రులు కామినేని, ప్రత్తిపాటి ఆరోపణల నేపథ్యంలో నేతలు గతాన్ని గుర్తు చేస్తున్నారు. 2010 డిసెంబర్‌లో రైతు సమస్యలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నిరవధిక దీక్ష చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష చేశారు. మూడు రోజుల పాటు దీక్ష చేసిన అనంతరం ఆయన పూర్తిగా నిరసించిపోయారు. దీక్ష భగ్నానికి ముందు వైద్యులు దీక్ష శిబిరం వద్ద పరీక్షలు నిర్వహించగా షుగర్ లెవల్స్ 80 గా ఉన్నట్టు తేలింది.

దీక్షను భగ్నం చేసిన పోలీసులు నిమ్స్‌కు తరలించారు. అక్కడ కూడా తాను దీక్ష కొనసాగిస్తానని వైద్యానికి చంద్రబాబు నిరాకరించారు. ఆ సమయంలోనే వైద్యులు పరీక్షలు నిర్వహించగా చంద్రబాబు షుగర్ లెవల్స్ ఏకంగా 100కి చేరింది. దీనిపై అప్పట్లో దుమారం రేగింది. చంద్రబాబు ఆస్పత్రిలో ఆహారం తీసుకున్నారని దొంగ దీక్ష అని కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోయారు.

అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రరెడ్డి అప్పట్లో టీడీపీలో ఉన్న మైసూరారెడ్డికి నేరుగా ఫోన్ చేసి ఈ విషయంపై ఆరా తీశారు. ”చంద్రబాబు కరెక్ట్‌గానే ఉన్నారా లేక ఆహారం ఏమైనా తీసుకుంటున్నారా” అని ఆరా తీశారు. ఈ విషయాన్ని మైసూరారెడ్డి కూడా ధృవీకరిస్తున్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోకపోయిన షుగర్ లెవల్స్ అప్పుడప్పుడు అలా పెరగడం, తగ్గడం సహజమని స్వయంగా డాక్టర్ అయిన మైసూరా రెడ్డి చెబుతున్నారు. కాబట్టి జగన్ దీక్షపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ మంత్రులు ముందుగా చంద్రబాబుకు అప్పట్లో షుగర్ లెవల్స్ ఎలా పెరిగాయో ఆయన్నే అడిగి తెలుసుకుని మాట్లాడాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

First Published:  12 Oct 2015 3:23 AM IST
Next Story