Telugu Global
National

ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై గ్రీన్ టాక్స్!

కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం నడుం కడుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి ఈ వెసులుబాటు లభించింది. ఢిల్లీలోకి ప్రవేశించే వాణిజ్యపరమైన వాహనాలపై హరిత పన్ను విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు నవంబర్‌ నుంచి అమలులోకి రానున్నాయి. లైట్‌ వెహికల్స్‌కు ఏడొందలు, హెవీ వెహికల్స్‌కు 1300 రూపాయలు హరిత పన్నుగా వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రయాణికుల వాహనాలు, అంబులెన్స్‌లపై హరిత పన్ను ఉండదు. ఢిల్లీలో ప్రవేశిస్తున్న వేలాది వాహనాల కారణంగా ఈ రాష్ట్రంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని నివారించడానికి […]

ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై గ్రీన్ టాక్స్!
X
కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం నడుం కడుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి ఈ వెసులుబాటు లభించింది. ఢిల్లీలోకి ప్రవేశించే వాణిజ్యపరమైన వాహనాలపై హరిత పన్ను విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు నవంబర్‌ నుంచి అమలులోకి రానున్నాయి. లైట్‌ వెహికల్స్‌కు ఏడొందలు, హెవీ వెహికల్స్‌కు 1300 రూపాయలు హరిత పన్నుగా వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రయాణికుల వాహనాలు, అంబులెన్స్‌లపై హరిత పన్ను ఉండదు. ఢిల్లీలో ప్రవేశిస్తున్న వేలాది వాహనాల కారణంగా ఈ రాష్ట్రంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని నివారించడానికి సంబంధిత వాహనాల నుంచే పన్నును వసూలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. కాలుష్యం వెదజల్లుతున్న వాహనాల యజమానుల నుంచి పరిహారం వసూలు చేసి ప్రజల మేలు కోసం ఉపయోగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీం తాజా ఆదేశాల కారణంగా ఢిల్లీలోకి వచ్చే వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం కూడా తగ్గుతుందని, ఒకవేళ వాహనాలు వచ్చినా అవి చెల్లించే పన్నుతో కలుషిత వాతావరణాన్ని తొలగించవచ్చని భావిస్తున్నారు.
First Published:  12 Oct 2015 11:37 AM GMT
Next Story