లంచం తీసుకుంటూ దొరికిపోయిన మంత్రి (video)
బీహర్ ఎన్నికల వేళ జేడీయూకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. నితీష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అవదేశ్ కుష్వాహా లంచం తీసుకుంటూ అడ్డంగా చిక్కిపోయారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే ఓ పని చేసి పెట్టేందుకు మంత్రి హామీ ఇస్తున్నట్టు వీడియో రికార్డయింది. ఈయన తన చేతులారా నాలుగు లక్షల లంచం తీసుకోవడం కూడా స్టింగ్ ఆపరేషన్ కెమెరాల్లో రికార్డయింది. దీంతో మంత్రి పదవికి కుష్వాహా రాజీనామా చేయకతప్పలేదు. నితీష్ దెబ్బకొట్టేందుకు బీజేపీయే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిందని బీజేపీ […]

బీహర్ ఎన్నికల వేళ జేడీయూకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. నితీష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అవదేశ్ కుష్వాహా లంచం తీసుకుంటూ అడ్డంగా చిక్కిపోయారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే ఓ పని చేసి పెట్టేందుకు మంత్రి హామీ ఇస్తున్నట్టు వీడియో రికార్డయింది. ఈయన తన చేతులారా నాలుగు లక్షల లంచం తీసుకోవడం కూడా స్టింగ్ ఆపరేషన్ కెమెరాల్లో రికార్డయింది. దీంతో మంత్రి పదవికి కుష్వాహా రాజీనామా చేయకతప్పలేదు. నితీష్ దెబ్బకొట్టేందుకు బీజేపీయే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిందని బీజేపీ వ్యతిరేక కూటమి ఆరోపిస్తోంది.