మనోరమ మరిలేరు
దక్షిణాది ప్రముఖ నటి, కమేడియన్, గాయని మనోరమ (78) కన్నుమూశారు. కొంతకాలంగా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. మనోరమ తమిళంలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎంజీఆర్, జయలలిత, కమలహాసన్, రజినీకాంత్, నగేశ్, చో రామస్వామి, చెన్నగి శ్రీనివాసన్, అర్జున్ తదితర ప్రముఖ సీనియర్ నటులతోపాటు నేటితరం నటులతోనూ కలిసి నటించారు. ఆవిడ ఒక్క తమిళానికే పరిమితం కాలేదు. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి సొంతంగా డబ్బింగ్ […]
దక్షిణాది ప్రముఖ నటి, కమేడియన్, గాయని మనోరమ (78) కన్నుమూశారు. కొంతకాలంగా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. మనోరమ తమిళంలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎంజీఆర్, జయలలిత, కమలహాసన్, రజినీకాంత్, నగేశ్, చో రామస్వామి, చెన్నగి శ్రీనివాసన్, అర్జున్ తదితర ప్రముఖ సీనియర్ నటులతోపాటు నేటితరం నటులతోనూ కలిసి నటించారు. ఆవిడ ఒక్క తమిళానికే పరిమితం కాలేదు. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని మెప్పించారు. మనోరమ తెరపై ఉంటే.. సీనియర్ నటులను సైతం డామినేట్ చేసేలా ఉంటుంది ఆమె నటన. తన జీవితకాలంలో దాదాపు 1300 సినిమాలు, 1000 స్టేజీషోలు, అనేక టీవీషోలలోనూ నటించారు. 1937, మే 26న తమిళనాడులోని మన్నార్‌గుడిలో గోపిశంతగా జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే నాటకాలు వేయడం ప్రారంభించింది. అక్కడే ఆమె మనోరమగా మారింది. 1964లో ఆమె ఎస్.ఎం రామనాథన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి 1965లో భూపతి అనే కుమారుడు జన్మించాడు. 1966లో వీరి వివాహ బంధానికి విడాకులతో తెరపడింది. అప్పటి నుంచి మనోరమ తన కుమారుడు భూపతితో కలిసి ఉంటున్నారు.